Stotras-స్తోత్రాలు Vishnu Stotras విష్ణు స్తోత్రాలు

Shatpadi Stotram in Telugu- షట్పదీ స్తోత్రం తెలుగులో

శ్రీ మహా విష్ణువుని స్తుతించుటకు వాడే స్త్రోత్రాలలో షట్పదీ స్తోత్రం ఎంతో ప్రత్యేకమైనది. మహావిష్ణువు యొక్క అవతారాల ఘన కీర్తిని, మానవాళికి చేసిన ఉపకారాన్ని చక్కగా వివరిస్తుంది ఈ స్తోత్రం.

ఈ స్తోత్రం లో ఆరు పాదాలలో ఉండుటవలన షట్పదీగా పిలవబడుతుంది. విష్ణు స్తోత్రం కాబ్బటి విష్ణు షట్పదీ. భక్తులను సంసార సాగరము నుండి ఉద్ధరింపచేసి మోక్ష మార్గమునకు తీసుకుపొమ్మనుచూ భగవంతుణ్ణి స్తుతిస్తూ సాగుతుంది ఈ స్తోత్రం.

మనల్ని మనం అర్థంచేసుకునేందుకు, మన జన్మ యొక్క ఉద్దేశాన్ని తెలుసుకునేందుకు ఈ స్తోత్ర పఠనం ఎంతో మంచిది. షట్పదీ స్తోత్రం అర్ధంచేసుకుంటూ చదివినా, విన్నా ఎంతో శుభప్రదం.

Shatpadi stotram in telugu of Lord Vishnu

Shatpadi Stotram in Telugu of Lord Vishnu- విష్ణు షట్పదీ స్తోత్రం తెలుగులో

అవినయ మపనయ విష్ణో  దమయ మనః శమయ విషయ మృగతృష్ణామ్
భూతదయాం విస్తారయ తారయ సంసార-సాగరతః (1)

ఓ విష్ణు మూర్తి, నా అవినయమును పోగొట్టుము. నాకు మనోనిగ్రహమును ప్రసాదించుము, ప్రాపంచిక విషయములనెడి  ఎండమావులను రూపుమాపుము, సర్వ ప్రాణుల (భూతదయ) యందు దయను పెంపొందింపుము, సంసార సాగరం నుండి బయటపడుటకు నాకు మార్గము చూపించుము.

దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే
శ్రీపతి పదారవిందే భవ భయ ఖేదచ్ఛిదే వందే (2)

ఆకాశ గంగయే మకరందముగా కలిగివుండి సచ్చిదానందమును పరిమళముగా కలిగి
సంసార భయ దుఃఖములను నశింపచేసేవి అయిన శ్రీపతి (లక్ష్మి దేవి భర్త అగు విష్ణువు) యొక్క పాద పద్మములకు నమస్కరించుచున్నాను

సత్యపి భేదాపగమే నాథ తవాహం న మామకీన స్త్వమ్
సాముద్రో హి తరంగః క్వచన సముద్రో న తారంగః (3)

ఓ నాథ, పరమ సత్యమును గ్రహించి నీకు నాకు భేదములేదు అను భావన కలిగినా కూడా, నేను నీకు చెందిన వాడినే కానీ నీవు నాకు చెందిన వాడవు కాదు ఎలాగంటే
ఎలాగంటే సముద్రము తరంగముల లాగా. తరంగములు సముద్రమునకు చెందినవి కానీ సముద్రము తరంగమునకు చెందదు కదా

ఉద్ధృతనగ నగభి-దనుజ దనుజ-కులామిత్ర మిత్ర శశిదృష్టే
దృష్టే భవతి ప్రభవతి న భవతి కిం భవ తిరస్కారః (4)

పర్వతమును ఎత్తిన వాడా (కృష్ణునిగా), పర్వతముల రెక్కలు తెగ్గొట్టిన ఇంద్రుని తమ్ముడా, రాక్షస కుల శత్రువుగా ఉన్నవాడా, సూర్యచంద్రులను కన్నులుగా కలవాడా
మీ దృష్టి మాపై ప్రసరించినచో, ప్రత్యక్షమైనచో సంసార బాధ నశించక ఎలా ఉంటుంది

మత్స్యాదిభి రవతారై రవతారవతావతా సదా వసుధామ్
పరమేశ్వర పరిపాల్యో భవతా భవతాప భీతోహం (5)

ప్రపంచమును కాపాడుటకు నీవు మత్స్య ఇతర అవతారములు ఎత్తితివి
ఓ పరమేశ్వరా, భవ తాపముతో సంసార తపముతో భయపడు నన్ను కాపాడుము.

దామోదర గుణమందిర సుందర వదనారవింద గోవింద
భవ జలధి మథన మందర పరమం దరమపనయ త్వం మే (6)

ఓ దామోదర (ఉదరము భాగమున త్రాడు వంటి ఆభరణము కలిగినవాడా), గుణములకు  నిలయమై, సుందరమగు పద్మము వంటి ముఖము కలిగినవాడా, గోవిందుడా ( గోవులను , సకల ప్రాణులను చూసుకొనువాడా)
సంసారమును సముద్రమును మథించు మందర పర్వతము వలే మథించువాడా, తీవ్రమగు నా భయమును పోగొట్టుము

నారాయణ కరుణామయ శరణం కరవాణి తావకౌ చరణౌ
ఇతి షట్పదీ మదీయే వదన సరోజే సదా వసతు (7)

ఓ నారాయణుడా, కరుణా మూర్తి, నీ పాదములను శరణు పొందుచున్నాను
ఇట్లు ఈ ఆరుపాదములు కలిగిన షట్పదీ స్తోత్రం ఆరుపాదములు కలిగిన తుమ్మెద వలే నా ముఖమనే పద్మము నందు ఎల్లపుడు నెలకొనుగాక

ఇతి శ్రీమత్ శంకరాచార్య విరచితమ్ విష్ణు షట్పది స్తోత్రం సంపూర్ణం

శంకరాచార్యునిచే శ్రీ మహా విష్ణువుపై రచింపబడిన షట్పది స్తోత్రం ఇంతటితో సంపూర్ణము.

About the author

Stotra Manjari Team

Leave a Comment