త్రిమూర్తుల స్వరూపంగా భావించే సూర్య భగవానుని ప్రార్ధించేందుకు సూర్య అష్టకం అపూర్వమైనది.
ఆరోగ్య ప్రధాత అయిన సూర్య భగవానుని దివ్య గుణ గణాలను వివరిస్తూ లీలావిశేషాలను కీర్తిస్తూ సాగుతుంది ఈ సూర్య అష్టకం.
సూర్యుణ్ణి ఆదిదేవునిగా, తెల్లని పద్మమును ధరించి, ఏడు గుర్రములు ఉండు రదమును అధిరోహించినవానిగా, సకల పాపములనూ తొలగించే దైవంగా సూర్య అష్టకం లో పరిపరి విధాలుగా వివరించబడినది.
గ్రహబాధలు తొలగేందుకు, సంతాన ప్రాప్తి కొరకు, ధనప్రాప్తికి, పాప నివృత్తికి ఈ అష్టకం భక్తులకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ఈ అష్టకముతోపాటు సూర్య ఆరాధనకు ఆదిత్య హృదయం మరియు సూర్య అష్టోత్తరమును పఠించటం కూడా ఎంతో ఉత్తమం.
Sri Surya Ashtakam in Telugu – శ్రీ సూర్య అష్టకం తెలుగులో
సాంబ ఉవాచ
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే (1)
సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్
శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ (2)
లోహితం రథమారూఢం సర్వలోకపితామహమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ (3)
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ (4)
బృంహితం తేజ పుంజం చ వాయుమాకాశమేవ చ
ప్రభుంచ సర్వలోకానాం తం సూర్యం ప్రణమామ్యహమ్ (5)
బంధూక పుష్ప సంకాశం హారకుండల భూషితమ్
ఏకచక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ (6)
తం సూర్యం జగత్కర్తారం మహాతేజః ప్రదీపనమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ (7)
తం సూర్యం జగతాం నాధం జ్ఞానవిజ్ఞాన మోక్షదమ్
మహాపాపహరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్ (8)
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే
సప్తజన్మ భవేద్రోగీ జన్మజన్మ దరిద్రతా
స్త్రీతైలమధుమాంసాని యే త్యజంతి రవేర్దినే
న వ్యాధిః శోకదారిద్ర్యం సూర్యలోకం స గచ్ఛతి
ఇతి శ్రీ సూర్య అష్టకం సంపూర్ణం
Leave a Comment