శరవణ భవ అంటూ భక్తులు వేడుకొనే కుమార స్వామి యొక్క 108 దివ్య నామాల కూర్పే శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్రం లేక సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి.
శివ కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి గొప్పదనాన్ని, జననాన్ని, శక్తిని, భక్తులపై చూపించు కరుణను గూర్చి వివరిస్తుంటాయి సుబ్రహ్మణ్య అష్టోత్రం లోని నామములు.
ఆయుషు, సంపద, సంతానాన్ని ప్రసాదించే గొప్ప దైవం సుబ్రహ్మణ్య స్వామి, అట్టి స్వామిని కీర్తించుటకు సుబ్రహ్మణ్య అష్టోత్రం ఉత్తమమైనది.
ఈ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి అందరూ అన్నివేళలా పఠించదగ్గది.
Subrahmanya Ashtottara Shatanamavali in Telugu- శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి
- ఓం స్కందాయ నమః
- ఓం గుహాయ నమః
- ఓం షణ్ముఖాయ నమః
- ఓం ఫాలనేత్ర సుతాయ నమః
- ఓం ప్రభవే నమః
- ఓం పింగళాయ నమః
- ఓం కృత్తికాసూనవే నమః
- ఓం శిఖివాహాయ నమః
- ఓం ద్విషడ్బుజాయ నమః
- ఓం ద్విషణ్ణేత్రాయ నమః
- ఓం శక్తిధరాయ నమః
- ఓం పిశితాశ ప్రభంజనాయ నమః
- ఓం తారకాసుర సంహర్తయే నమః
- ఓం రక్షోబల విమర్దనాయ నమః
- ఓం మత్తాయ నమః
- ఓం ప్రమత్తాయ నమః
- ఓం ఉన్మత్తాయ నమః
- ఓం సురసైన్య సురక్షకాయ నమః
- ఓం దేవసేనా-పతయే నమః
- ఓం ప్రాజ్ఞాయ నమః
- ఓం కృపాళవే నమః
- ఓం భక్త వత్సలాయ నమః
- ఓం ఉమాసుతాయ నమః
- ఓం శక్తిధరాయ నమః
- ఓం కుమారాయ నమః
- ఓం క్రౌంచదారణాయ నమః
- ఓం సేనాన్యే నమః
- ఓం అగ్నిజన్మనే నమః
- ఓం విశాఖాయ నమః
- ఓం శంకరాత్మజాయ నమః
- ఓం శివ స్వామినే నమః
- ఓం గణస్వామినే నమః
- ఓం సర్వస్వామినే నమః
- ఓం సనాతనాయ నమః
- ఓం అనంతశక్తయే నమః
- ఓం అక్షోభ్యాయ నమః
- ఓం పార్వతీ ప్రియ నందనాయ నమః
- ఓం గంగాసుతాయ నమః
- ఓం శరోద్భూతాయ నమః
- ఓం ఆహూతాయ నమః
- ఓం పావకాత్మజాయ నమః
- ఓం జృంభాయ నమః
- ఓం ప్రజృంభాయ నమః
- ఓం ఉజ్జృంభాయ నమః
- ఓం కమలాసన సంస్తుతాయ నమః
- ఓం ఏకవర్ణాయ నమః
- ఓం ద్వివర్ణాయ నమః
- ఓం త్రివర్ణాయ నమః
- ఓం సుమనోహరయ నమః
- ఓం చతుర్వర్ణాయ నమః
- ఓం పంచవర్ణాయ నమః
- ఓం ప్రజాపతయే నమః
- ఓం అహస్పతయే నమః
- ఓం అగ్నిగర్భాయ నమః
- ఓం శమీగర్భాయ నమః
- ఓం విశ్వరేతసే నమః
- ఓం సురారిఘ్నే నమః
- ఓం హరిద్వర్ణాయ నమః
- ఓం శుభకరాయ నమః
- ఓం వటవే నమః
- ఓం వటువేషభృతే నమః
- ఓం పూష్ణే నమః
- ఓం గభస్తయే నమః
- ఓం గవానాయ నమః
- ఓం చంద్రవర్ణాయ నమః
- ఓం కళాధరాయ నమః
- ఓం మాయాధరాయ నమః
- ఓం మహామాయినే నమః
- ఓం కైవల్యాయ నమః
- ఓం శంకరాత్మజాయ నమః
- ఓం విశ్వయోనయే నమః
- ఓం అమేయాత్మాయ నమః
- ఓం తేజోనిధయే నమః
- ఓం అనామయాయ నమః
- ఓం పరమేష్ఠినే నమః
- ఓం పరబ్రహ్మనే నమః
- ఓం వేదగర్భాయ నమః
- ఓం విరాట్ సుతాయ నమః
- ఓం పుళింద కన్యాభర్త్రే నమః
- ఓం మహా సారస్వతావృతాయ నమః
- ఓం ఆశ్రితాఖిలధాత్రే నమః
- ఓం చోరఘ్నాయ నమః
- ఓం రోగనాశనాయ నమః
- ఓం అనంత మూర్తయే నమః
- ఓం ఆనందాయ నమః
- ఓం శిఖండికృత కేతనాయ నమః
- ఓం డంభాయ నమః
- ఓం పరమడంభాయ నమః
- ఓం మహాడంభాయ నమః
- ఓం వృషాకపయే నమః
- ఓం కారణోపాత్త దేహాయ నమః
- ఓం కారణాతీత విగ్రహాయ నమః
- ఓం అనీశ్వరాయ నమః
- ఓం అమృతాయ నమః
- ఓం ప్రాణాయ నమః
- ఓం ప్రాణాయామ పరాయణాయ నమః
- ఓం విరుద్ధ హంత్రే నమః
- ఓం వీరఘ్నాయ నమః
- ఓం రక్తశ్యామగళాయ నమః
- ఓం సుబ్రహ్మణ్యాయ నమః
- ఓం గుహాయ నమః
- ఓం ప్రీతాయ నమః
- ఓం బ్రహ్మణ్యాయ నమః
- ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః
- ఓం వంశవృద్ధికరాయ నమః
- ఓం వేదాయ నమః
- ఓం వేద్యాయ నమః
- ఓం అక్షయ ఫలప్రదాయ నమః
ఓం వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామినే నమః
ఇతి శ్రీ సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
భక్తులు సుబ్రహ్మణ్య అష్టోత్రంతో పాటు తప్పక పఠించతగ్గ స్తోత్రాలు సుబ్రహ్మణ్య అష్టకం లేక కరవలంబ స్తోత్రం.
Leave a Comment