Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Ganesha Ashtottara Shatanamavali in Telugu – గణేశ అష్టోత్తర శతనామావళి గణేశ అష్టోత్రం

గణేశుని పూజలో గణేశ అష్టోత్తర శతనామావళి ఒక ప్రత్యేకమైనది. గణనాధున్ని ప్రార్ధించుటలో, అనేక వినాయక కథలను జ్ఞప్తికి తెచ్చుకోవటం కొరకు గణేశ అష్టోత్రం ఎంతో ఉపయోగపడుతుంది.

ఆదిదంపతులైన పార్వతీ, పరమేశ్వరుల పుత్రుడు వినాయకుడు. అంటే  శివ శక్తి తత్త్వాల మేళవింపు. అట్టి గణేశుని అనేక నామాలను, గుణగణాలను, గొప్పతనాన్ని, కథలనూ వివరిస్తూ సాగుతుంటాయి గణేశ అష్టోత్తర శతనామావళి లోని నామాలు.

అట్టి గణేశ అష్టోత్రం ఎల్లప్పుడూ పఠించతగ్గది. విఘ్నాలను నివారించి కీర్తిని, సంపదను, విద్యను భక్తులకు ప్రదిస్తుంది ఈ అష్టోత్తర శతనామావళి పఠనం.

Ganesha ashtottara shatanamavali in Telugu - Ganesha ashtothram in Telugu
Lord Ganesha

Sri Ganesha Ashtottara Shatanamavali in Telugu – Ganesha Ashtothram శ్రీ గణేశ అష్టోత్తర శతనామావళి లేక గణేశ అష్టోత్రం తెలుగులో

  1. ఓం గజాననాయ నమః
  2. ఓం గణాధ్యక్షాయ నమః
  3. ఓం విఘ్నారాజాయ నమః
  4. ఓం వినాయకాయ నమః
  5. ఓం ద్త్వెమాతురాయ నమః
  6. ఓం ద్విముఖాయ నమః
  7. ఓం ప్రముఖాయ నమః
  8. ఓం సుముఖాయ నమః
  9. ఓం కృతినే నమః
  10. ఓం సుప్రదీపాయ నమః
  11. ఓం సుఖనిధయే నమః
  12. ఓం సురాధ్యక్షాయ నమః
  13. ఓం సురారిఘ్నాయ నమః
  14. ఓం మహాగణపతయే నమః
  15. ఓం మాన్యాయ నమః
  16. ఓం మహాకాలాయ నమః
  17. ఓం మహాబలాయ నమః
  18. ఓం హేరంబాయ నమః
  19. ఓం లంబకర్ణాయ లంబజఠరాయ నమః
  20. ఓం హ్రస్వగ్రీవాయ నమః
  21. ఓం మహోదరాయ నమః
  22. ఓం మదోత్కటాయ నమః
  23. ఓం మహావీరాయ నమః
  24. ఓం మంత్రిణే నమః
  25. ఓం మంగళ స్వరూపాయ నమః
  26. ఓం ప్రమధాయ నమః
  27. ఓం ప్రథమాయ నమః
  28. ఓం ప్రాజ్ఞాయ నమః
  29. ఓం విఘ్నకర్త్రే నమః
  30. ఓం విఘ్నహంత్రే నమః
  31. ఓం విశ్వనేత్రే నమః
  32. ఓం విరాట్పతయే నమః
  33. ఓం శ్రీపతయే నమః
  34. ఓం వాక్పతయే నమః
  35. ఓం శృంగారిణే నమః
  36. ఓం ఆశ్రిత వత్సలాయ నమః
  37. ఓం శివప్రియాయ నమః
  38. ఓం శీఘ్రకారిణే నమః
  39. ఓం శాశ్వతాయ నమః
  40. ఓం బలాయ నమః
  41. ఓం బలోత్థితాయ నమః
  42. ఓం భవాత్మజాయ నమః
  43. ఓం పురాణ పురుషాయ నమః
  44. ఓం పూష్ణే నమః
  45. ఓం పుష్కరోత్షిప్త వారిణే నమః
  46. ఓం అగ్రగణ్యాయ నమః
  47. ఓం అగ్రపూజ్యాయ నమః
  48. ఓం అగ్రగామినే నమః
  49. ఓం మంత్రకృతే నమః
  50. ఓం చామీకర ప్రభాయ నమః
  51. ఓం సర్వాయ నమః
  52. ఓం సర్వోపన్యాసాయ నమః
  53. ఓం సర్వకర్త్రే నమః
  54. ఓం సర్వనేత్రే నమః
  55. ఓం సర్వసిధ్ధిప్రదాయ నమః
  56. ఓం సర్వసిద్ధయే నమః
  57. ఓం పంచహస్తాయ నమః
  58. ఓం పార్వతీ నందనాయ నమః
  59. ఓం ప్రభవే నమః
  60. ఓం కుమార గురవే నమః
  61. ఓం అక్షోభ్యాయ నమః
  62. ఓం కుంజరాసుర భంజనాయ నమః
  63. ఓం ప్రమోదాయ నమః
  64. ఓం మోదకప్రియాయ నమః
  65. ఓం కాంతిమతే నమః
  66. ఓం ధృతిమతే నమః
  67. ఓం కామినే నమః
  68. ఓం కపిత్థ పనస ప్రియాయ నమః
  69. ఓం బ్రహ్మచారిణే నమః
  70. ఓం బ్రహ్మరూపిణే నమః
  71. ఓం బ్రహ్మవిద్యాధిపాయ నమః
  72. ఓం జిష్ణవే నమః
  73. ఓం విష్ణుప్రియాయ నమః
  74. ఓం భక్తజీవితాయ నమః
  75. ఓం జితమన్మథాయ నమః
  76. ఓం ఐశ్వర్య కారణాయ నమః
  77. ఓం జ్యాయసే నమః
  78. ఓం యక్షకిన్నెర సేవితాయ నమః
  79. ఓం గంగాసుతాయ నమః
  80. ఓం గణాధీశాయ నమః
  81. ఓం గంభీర నినదాయ నమః
  82. ఓం వటవే నమః
  83. ఓం అభీష్ట వరదాయినే నమః
  84. ఓం జ్యోతిషే నమః
  85. ఓం భక్తనిధయే నమః
  86. ఓం భావగమ్యాయ నమః
  87. ఓం మంగళ ప్రదాయ నమః
  88. ఓం అవ్వక్తాయ నమః
  89. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
  90. ఓం సత్యధర్మిణే నమః
  91. ఓం సఖయే నమః
  92. ఓం సరసాంబునిధయే నమః
  93. ఓం మహేశాయ నమః
  94. ఓం దివ్యాంగాయ నమః
  95. ఓం మణికింకిణీ మేఖాలాయ నమః
  96. ఓం సమస్త దేవతా మూర్తయే నమః
  97. ఓం సహిష్ణవే నమః
  98. ఓం సతతోత్థితాయ నమః
  99. ఓం విఘాతకారిణే నమః
  100. ఓం విశ్వక్దృశే నమః
  101. ఓం విశ్వరక్షాకృతే నమః
  102. ఓం కళ్యాణ గురవే నమః
  103. ఓం ఉన్మత్త వేషాయ నమః
  104. ఓం అపరాజితే నమః
  105. ఓం సమస్త జగదాధారాయ నమః
  106. ఓం సర్త్వెశ్వర్యప్రదాయ నమః
  107. ఓం ఆక్రాన్త చిదచిత్ప్రభవే నమః
  108. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

శ్రీ సిద్ధి బుద్ధి సామెత వరసిద్ధి వినాయక స్వామినే నమః

About the author

Stotra Manjari Team

Leave a Comment