దశమహా విద్యలో మొదటి విద్యగా, పార్వతి దేవి యొక్క ప్రచండ రూపముగా కొలవబడుతున్న కాళీమాత యొక్క 108 నామాలను కాళీ అష్టోత్రం అంటారు.
ఈ కాళీ అష్టోత్తర శతనామావళి లో కపాల మాల ధరించి మృత్యువును సైతం భయపెట్టగల కాళికాదేవి యొక్క విశిష్ట నామాలను గురించి తెలుసుకుంటాము. స్త్రీ అంటే శక్తి అని బ్రహ్మాండానికి చాటిచెప్పిన ఆదిపరాశక్తి యొక్క అద్భుతమైన రూపమే ఈ కాళీ.
ప్రచండ స్వరూపముతో ఉన్నా మిక్కిలి కారుణ్యము కలిగి ఉన్నమూర్తి కాళీ దేవి. అమ్మ అని పిలిచిన వారి ఆపదలను యిట్టే హరించివేసే దయామయి ఆమె. అట్టి దేవి గుణగణాలను, స్వరూపమును, శక్తిని, దుష్ట సంహారాన్ని వివరిస్తూ సాగుతుంటుంది ఈ కాళీ అష్టోత్రం.
ప్రతిదినం కాళీమాతను నిష్ఠతో ఉపాసించుట వలన సర్వ విపత్తులు తొలగిపోయి సర్వ సౌభాగ్యాలు లభిస్తాయి.
Sri Kali Ashtothram in Telugu – 108 names of Goddess Kali- కాళీ అష్టోత్రం
- ఓం కాల్యై నమః
- ఓం కపాలిన్యై నమః
- ఓం కాంతాయై నమః
- ఓం కామదాయై నమః
- ఓం కామసుందర్యై నమః
- ఓం కాలరాత్ర్యై నమః
- ఓం కాలికాయై నమః
- ఓం కాలభైరవ పూజితాయై నమః
- ఓం కురుకుల్లాయై నమః
- ఓం కామిన్యై నమః
- ఓం కమనీయ స్వభావిన్యై నమః
- ఓం కులీనాయై నమః
- ఓం కులకర్త్ర్యై నమః
- ఓం కులవర్త్మ ప్రకాశిన్యై నమః
- ఓం కస్తూరీరస నీలాయై నమః
- ఓం కామ్యాయై నమః
- ఓం కామ స్వరూపిణ్యై నమః
- ఓం కకారవర్ణ నిలయాయై నమః
- ఓం కామధేనవే నమః
- ఓం కరాలికాయై నమః
- ఓం కులకాంతాయై నమః
- ఓం కరాలాస్యాయై నమః
- ఓం కామార్తాయై నమః
- ఓం కలావత్యై నమః
- ఓం కృశోదర్యై నమః
- ఓం కామాఖ్యాయై నమః
- ఓం కౌమార్యై నమః
- ఓం కులపాలిన్యై నమః
- ఓం కులజాయై నమః
- ఓం కులకన్యాయై నమః
- ఓం కులహాయై నమః
- ఓం కుల పూజితాయై నమః
- ఓం కామేశ్వర్యై నమః
- ఓం కామకాంతాయై నమః
- ఓం కుంజరేశ్వర గామిన్యై నమః
- ఓం కామదాత్ర్యై నమః
- ఓం కామహర్త్ర్యై నమః
- ఓం కృష్ణాయై నమః
- ఓం కపర్ధిన్యై నమః
- ఓం కుముదాయై నమః
- ఓం కృష్ణ దేహాయై నమః
- ఓం కాలింద్యై నమః
- ఓం కుల పూజితాయై నమః
- ఓం కాశ్యప్యై నమః
- ఓం కృష్ణ మాత్రే నమః
- ఓం కులిశాంగ్యై నమః
- ఓం కలాయై నమః
- ఓం క్రీం రూపాయై నమః
- ఓం కులగమ్యాయై నమః
- ఓం కమలాయై నమః
- ఓం కృష్ణ పూజితాయై నమః
- ఓం కృశాంగ్యై నమః
- ఓం కిన్నర్యై నమః
- ఓం కర్త్ర్యై నమః
- ఓం కలకంఠ్యై నమః
- ఓం కార్తిక్యై నమః
- ఓం కంబుకంఠ్యై నమః
- ఓం కౌలిన్యై నమః
- ఓం కుముదాయై నమః
- ఓం కామజీవిన్యై నమః
- ఓం కులస్త్రియై నమః
- ఓం కీర్తికాయై నమః
- ఓం కృత్యాయై నమః
- ఓం కీర్త్యై నమః
- ఓం కులపాలికాయై నమః
- ఓం కామదేవ కలాయై నమః
- ఓం కల్పలతాయై నమః
- ఓం కామాంగ వర్ధిన్యై నమః
- ఓం కుంతాయై నమః
- ఓం కుముద ప్రీతాయై నమః
- ఓం కదంబ కుసుమోత్సుకాయై నమః
- ఓం కాదంబిన్యై నమః
- ఓం కమలిన్యై నమః
- ఓం కృష్ణానంద ప్రదాయిన్యై నమః
- ఓం కుమారీపూజన రతాయై నమః
- ఓం కుమారీగణ శోభితాయై నమః
- ఓం కుమారీరంజన రతాయై నమః
- ఓం కుమారీవ్రత ధారిణ్యై నమః
- ఓం కంకాల్యై నమః
- ఓం కమనీయాయై నమః
- ఓం కామశాస్త్ర విశారదాయై నమః
- ఓం కపాల ఖట్వాంగ ధరాయై నమః
- ఓం కాలభైరవ రూపిణ్యై నమః
- ఓం కోటర్యై నమః
- ఓం కోటరాక్ష్యై నమః
- ఓం కాశీ వాసిన్యై నమః
- ఓం కైలాస వాసిన్యై నమః
- ఓం కాత్యాయన్యై నమః
- ఓం కార్యకర్యై నమః
- ఓం కావ్యశాస్త్ర ప్రమోదిన్యై నమః
- ఓం కామాకర్షణ రూపాయై నమః
- ఓం కామపీఠని వాసిన్యై నమః
- ఓం కంకిన్యై నమః
- ఓం కాకిన్యై నమః
- ఓం క్రీడాయై నమః
- ఓం కుత్సితాయై నమః
- ఓం కలహ ప్రియాయై నమః
- ఓం కుండగోలోద్భవ ప్రాణాయై నమః
- ఓం కౌశిక్యై నమః
- ఓం కీర్తి వర్ధిన్యై నమః
- ఓం కుంభస్తన్యై నమః
- ఓం కటాక్షాయై నమః
- ఓం కావ్యాయై నమః
- ఓం కొకనద ప్రియాయై నమః
- ఓం కాంతార వాసిన్యై నమః
- ఓం కాంత్యై నమః
- ఓం కఠినాయై నమః
- ఓం కృష్ణ వల్లభాయై నమః
ఇతి శ్రీ కాళీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
చాలా బాగా వివరించారు