ఐశ్వర్య ప్రదాత, నవనిధులకి అధిపతిగా ఉన్న కుబేరుని 108 దివ్య నామాల కూర్పే ఈ కుబేర అష్టోత్తర శతనామావళి లేక కుబేర అష్టోత్రం.
పురాణ ఇతిహాసాలలో కుబేరునికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. పరమ శివ భక్తునిగా, యక్షరాజుగా, అపార ఐశ్వర్యవంతునిగా, దిక్పాలకునిగా, రావణుని తమ్మునిగా, నవనిధులకి అధిపతిగా ఇలా ఎన్నో రకాలుగా కుబేరుని గురించి వింటూనే ఉంటాం.
అట్టి కుబేరుని ఔనత్యాన్ని, భక్తులపై అయన చూపు కరుణాని, ఐశ్వర్యాన్ని ఇచ్చు గుణమును వివరిస్తుంటాయి కుబేర అష్టోత్రం లోని నామాలు.
మీరు ఆర్ధిక సమస్యలు ఎదురుకుంటున్నట్లయితే ధనకటాక్షం కొరకు తప్పక కుబేరుడు, లక్ష్మిదేవితో కూడిఉన్న స్వర్ణాకర్షణ భైరవ పటాన్ని మీ ఇంట్లోని హాల్ లేదా పూజగదిలో పెట్టి స్వర్ణకర్షణ భైరవ లేదా శివ అష్టోత్రం, కుబేర, లక్ష్మి అష్టోత్రం తో పూజించండి. తప్పక మంచి జరుగుతుంది.
ఈ కుబేర అష్టోత్తర శతనామావళిని నిత్యము జపించిన వారికి సమస్త దారిద్యములు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలతో తులతూగుతారని ప్రతీతి.
Sri Kubera Ashtottara Shatanamavali in Telugu- Kubera Ashtothram కుబేర అష్టోత్రం- అష్టోత్తర శతనామావళి
- ఓం కుబేరాయ నమః
- ఓం ధనదాయ నమః
- ఓం శ్రీమతే నమః
- ఓం యక్షేశాయ నమః
- ఓం గుహ్యకేశ్వరాయ నమః
- ఓం నిధీశాయ నమః
- ఓం శంకర సఖాయ నమః
- ఓం మహాలక్ష్మీ నివాసభువే నమః
- ఓం మహాపద్మ నిధీశాయ నమః
- ఓం పూర్ణాయ నమః
- ఓం పద్మ నిధీశ్వరాయ నమః
- ఓం శంఖాఖ్య నిధినాథాయ నమః
- ఓం మకరాఖ్య నిధిప్రియాయ నమః
- ఓం సుకచ్ఛ పనిధీశాయ నమః
- ఓం ముకుంద నిధినాయకాయ నమః
- ఓం కుండాక్యా నిధినాథాయ నమః
- ఓం నీలనిత్యాధిపాయ నమః
- ఓం మహతే నమః
- ఓం వరనిధి దీపాయ నమః
- ఓం పూజ్యాయ నమః
- ఓం లక్ష్మీసామ్రాజ్య దాయకాయ నమః
- ఓం ఇలపిలాపత్యాయ నమః
- ఓం కోశాధీశాయ నమః
- ఓం కులోధీశాయ నమః
- ఓం అశ్వారూఢాయ నమః
- ఓం విశ్వవంద్యాయ నమః
- ఓం విశేషజ్ఞాయ నమః
- ఓం విశారదాయ నమః
- ఓం నలకూబరనాథాయ నమః
- ఓం మణిగ్రీవపిత్రే నమః
- ఓం గూఢ మంత్రాయ నమః
- ఓం వైశ్రవణాయ నమః
- ఓం చిత్రలేఖా మనఃప్రియాయ నమః
- ఓం ఏకపింగాయ నమః
- ఓం అలకాధీశాయ నమః
- ఓం బౌలస్థాయ నమః
- ఓం నరవాహనాయ నమః
- ఓం కైలాసశైల నిలయాయ నమః
- ఓం రాజ్యదాయ నమః
- ఓం రావణాగ్రజాయ నమః
- ఓం చిత్రచైత్ర రథాయ నమః
- ఓం ఉద్యాన విహారాయ నమః
- ఓం విహార సుకుతూహలాయ నమః
- ఓం మహోత్సాహాయ నమః
- ఓం మహాప్రాజ్ఞాయ నమః
- ఓం సదాపుష్పక వాహనాయ నమః
- ఓం సార్వభౌమాయ నమః
- ఓం అంగనాథాయ నమః
- ఓం సోమాయ నమః
- ఓం సౌమ్యాదికేశ్వరాయ నమః
- ఓం పుణ్యాత్మనే నమః
- ఓం పురుహూతశ్రియై నమః
- ఓం సర్వపుణ్య జనేశ్వరాయ నమః
- ఓం నిత్యకీర్తయే నమః
- ఓం నీతివేత్రే నమః
- ఓం లంకాప్రాక్ధన నాయకాయ నమః
- ఓం యక్షాయ నమః
- ఓం పరమశాంతాత్మనే నమః
- ఓం యక్షరాజాయ నమః
- ఓం యక్షిణీవృతాయ నమః
- ఓం కిన్నరేశాయ నమః
- ఓం కింపురుష నాథాయ నమః
- ఓం ఖడ్గాయుధాయ నమః
- ఓం వశినే నమః
- ఓం ఈశానదక్షపార్శ్వస్థాయ నమః
- ఓం వాయువామసమాశ్రయాయ నమః
- ఓం ధర్మమార్గనిరతాయ నమః
- ఓం ధర్మసమ్ముఖ సంస్థితాయ నమః
- ఓం నిత్యేశ్వరాయ నమః
- ఓం ధనాధ్యక్షాయ నమః
- ఓం అష్టలక్ష్మీ ఆశ్రితాలయాయ నమః
- ఓం మనుష్య ధర్మిణే నమః
- ఓం సకృతాయ నమః
- ఓం కోశలక్ష్మీ సమాశ్రితాయ నమః
- ఓం ధనలక్ష్మీ నిత్యవాసాయ నమః
- ఓం ధాన్యలక్ష్మీ నివాసభువే నమః
- ఓం అశ్వలక్ష్మీ సదావాసాయ నమః
- ఓం గజలక్ష్మీ స్థిరాలయాయ నమః
- ఓం రాజ్యలక్ష్మీ జన్మగేహాయ నమః
- ఓం ధైర్యలక్ష్మీ కృపాశ్రయాయ నమః
- ఓం అఖండైశ్వర్య సంయుక్తాయ నమః
- ఓం నిత్యానందాయ నమః
- ఓం సుఖాశ్రయాయ నమః
- ఓం నిత్యతృప్తాయ నమః
- ఓం నిధిధాత్రే నమః
- ఓం నిరాశ్రయాయ నమః
- ఓం నిరుపద్రవాయ నమః
- ఓం నిత్యకామాయ నమః
- ఓం నిరాకాంక్షాయ నమః
- ఓం నిరుపాధిక వాసభువే నమః
- ఓం శాంతాయ నమః
- ఓం సర్వగుణోపేతాయ నమః
- ఓం సర్వజ్ఞాయ నమః
- ఓం సర్వసమ్మతాయ నమః
- ఓం సర్వాణి కరుణాపాత్రాయ నమః
- ఓం సదానంద కృపాలయాయ నమః
- ఓం గంధర్వకుల సంసేవ్యాయ నమః
- ఓం సౌగంధి-కుసుమప్రియాయ నమః
- ఓం స్వర్ణనగరీవాసాయ నమః
- ఓం నిధిపీఠ సమాశ్రయాయ నమః
- ఓం మహామేరూత్తరస్థాయనే నమః
- ఓం మహర్షిగణ సంస్తుతాయ నమః
- ఓం తుష్టాయ నమః
- ఓం శూర్పణకా జ్యేష్ఠాయ నమః
- ఓం శివపూజరతాయ నమః
- ఓం అనఘాయ నమః
- ఓం రాజయోగ సమాయుక్తాయ నమః
- ఓం రాజశేఖర పూజకాయ నమః
ఓం రాజరాజాయ కుబేరాయ నమః
ఇతి శ్రీ కుబేర అష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్
Leave a Comment