Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Narasimha Ashtottara Shatanamavali in Telugu- శ్రీ నరసింహ అష్టోత్తర శతనామావళి

నరసింహ స్వామి ఆరాధనలో నరసింహ అష్టోత్తర శతనామావళి లోని నామాలకు ఒక ప్రత్యేకమైన స్థానముంది.

మహావిష్ణువు హిరణ్యకశిపుని సంహరించుటకు సింహముఖంతో మానవదేహంతో నృసింహునిగా అవతరించాడు. రౌద్రమూర్తియే అయినా అంతే కరుణా హృదయుడు కూడా.

నరసింహ అష్టోత్రం లోని నామములు స్వామివారి దివ్యలీలలను, శక్తిని, పరాక్రమాన్ని, అనేక అవతార అంశాలనూ వివరిస్తుంటాయి. వీటితోపాటుగా భక్త సులభుడగు నృసింహ స్వామి యొక్క కరుణా, కటాక్షాలను కీర్తిస్తుంటాయి.

108 నామములను కలిగి ఉన్న నరసింహ అష్టోత్తర శతనామావళి పఠించటం వల్ల శత్రు బాధలు తొలగిపోయి సుఖ సంపదలతో తలతూగుతారని ప్రతీతి. గృహ శాంతి కొరకు, భూత, పిశాచ పీడ నివారణకు కూడా నృసింహ ఆరాధన ఎంతో మంచిది.

Narasimha Ashtottara Shatanamavali in Telugu- Narasimha Ashtothram of Lord Lakshmi Narasimha.

Sri Narasimha Ashtottara Shatanamavali in Telugu, Narasimha Ashtothram- శ్రీ నరసింహ అష్టోత్తర శతనామావళి (తెలుగు)

  1. ఓం నారసింహాయ నమః
  2. ఓం మహాసింహాయ నమః
  3. ఓం దివ్యసింహాయ నమః
  4. ఓం మహాబలాయ నమః
  5. ఓం ఉగ్రసింహాయ నమః
  6. ఓం మహాదేవాయ నమః
  7. ఓం స్తంభజాయ నమః
  8. ఓం ఉగ్రలోచనాయ నమః
  9. ఓం రౌద్రాయ నమః
  10. ఓం సర్వాద్భుతాయ నమః
  11. ఓం శ్రీమతే నమః
  12. ఓం యోగానందాయ నమః
  13. ఓం త్రివిక్రమాయ నమః
  14. ఓం హరయే నమః
  15. ఓం కోలాహలాయ నమః
  16. ఓం చక్రిణే నమః
  17. ఓం విజయాయ నమః
  18. ఓం జయవర్ధనాయ నమః
  19. ఓం పంచాననాయ నమః
  20. ఓం పరబ్రహ్మణే నమః
  21. ఓం అఘోరాయ నమః
  22. ఓం ఘోరవిక్రమాయ నమః
  23. ఓం జ్వలన్ముఖాయ నమః
  24. ఓం జ్వాలమాలినే నమః
  25. ఓం మహాజ్వాలాయ నమః
  26. ఓం మహాప్రభవే నమః
  27. ఓం నిటిలాక్షాయ నమః
  28. ఓం సహస్రాక్షాయ నమః
  29. ఓం దుర్నిరీక్షాయ నమః
  30. ఓం ప్రతాపనాయ నమః
  31. ఓం మహా-దంష్ట్రాయుధాయ నమః
  32. ఓం ప్రాజ్ఞాయ నమః
  33. ఓం చండకోపినే నమః
  34. ఓం సదాశివాయ నమః
  35. ఓం హిరణ్యకశిపు ధ్వంసినే నమః
  36. ఓం దైత్యదానవ భంజనాయ నమః
  37. ఓం గుణభద్రాయ నమః
  38. ఓం మహాభద్రాయ నమః
  39. ఓం బలభద్రాయ నమః
  40. ఓం సుభద్రకాయ నమః
  41. ఓం కరాళాయ నమః
  42. ఓం వికరాళాయ నమః
  43. ఓం వికర్త్రే నమః
  44. ఓం సర్వకర్తృకాయ నమః
  45. ఓం శింశుమారాయ నమః
  46. ఓం త్రిలోకాత్మనే నమః
  47. ఓం ఈశాయ నమః
  48. ఓం సర్వేశ్వరాయ నమః
  49. ఓం విభవే నమః
  50. ఓం భైరవాడంబరాయ నమః
  51. ఓం దివ్యాయ నమః
  52. ఓం అచ్యుతాయ నమః
  53. ఓం కవయే నమః, మాధవాయ నమః
  54. ఓం అధోక్షజాయ నమః
  55. ఓం అక్షరాయ నమః
  56. ఓం శర్వాయ నమః
  57. ఓం వనమాలినే నమః
  58. ఓం వరప్రదాయ నమః
  59. ఓం విశ్వంభరాయ నమః
  60. ఓం అద్భుతాయ నమః
  61. ఓం భవ్యాయ నమః
  62. ఓం శ్రీవిష్ణవే నమః
  63. ఓం పురుషోత్తమాయ నమః
  64. ఓం అనఘాస్త్రాయ నమః
  65. ఓం నఖాస్త్రాయ నమః
  66. ఓం సూర్య జ్యోతిషే నమః
  67. ఓం సురేశ్వరాయ నమః
  68. ఓం సహస్ర బాహవే నమః
  69. ఓం సర్వజ్ఞాయ నమః
  70. ఓం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః
  71. ఓం వజ్రదంష్ట్రాయ నమః
  72. ఓం వజ్రనఖాయ నమః
  73. ఓం మహానందాయ నమః
  74. ఓం పరంతపాయ నమః
  75. ఓం సర్వ మంత్రైకరూపాయ నమః
  76. ఓం సర్వ యంత్రవిదారణాయ నమః
  77. ఓం సర్వ తంత్రాత్మకాయ నమః
  78. ఓం అవ్యక్తాయ నమః
  79. ఓం సువ్యక్తాయ నమః
  80. ఓం భక్తవత్సలాయ నమః
  81. ఓం వైశాఖశుక్ల భూతోత్థాయ నమః
  82. ఓం శరణాగత వత్సలాయ నమః
  83. ఓం ఉదారకీర్తయే నమః
  84. ఓం పుణ్యాత్మనే నమః
  85. ఓం మహాత్మనే నమః
  86. ఓం చండవిక్రమాయ నమః
  87. ఓం వేదత్రయ ప్రపూజ్యాయ నమః
  88. ఓం భగవతే నమః
  89. ఓం పరమేశ్వరాయ నమః
  90. ఓం శ్రీవత్సాంకాయ నమః
  91. ఓం శ్రీనివాసాయ నమః
  92. ఓం జగద్వ్యాపినే నమః
  93. ఓం జగన్మయాయ నమః
  94. ఓం జగత్పాలాయ నమః
  95. ఓం జగన్నాథాయ నమః
  96. ఓం మహాకాయాయ నమః
  97. ఓం ద్విరూపభృతే నమః
  98. ఓం పరమాత్మనే నమః
  99. ఓం పరంజ్యోతిషే నమః
  100. ఓం నిర్గుణాయ నమః
  101. ఓం నృకేసరిణే నమః
  102. ఓం పరతత్త్వాయ నమః
  103. ఓం పరంధామ్నే నమః
  104. ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
  105. ఓం లక్ష్మీనృసింహాయ నమః
  106. ఓం సర్వాత్మనే నమః
  107. ఓం ధీరాయ నమః
  108. ఓం ప్రహ్లాద పాలకాయ నమః

ఓం శ్రీ లక్ష్మి నరసింహాయ నమః

ఇతి శ్రీ నరసింహ అష్టోత్తర శతనామావళి

About the author

Stotra Manjari Team

Leave a Comment