Mantras, Slokas మంత్రములు, శ్లోకములు

Suklam baradharam Vishnum Lyrics in Telugu – శుక్లాంబరధరం విష్ణుం తెలుగులో

అనాది దైవమైన గణేశుని శ్లోకములలో ఎంతో ప్రసిద్ధిచెందినది శుక్లాం బరధరం విష్ణుం. ఈ శ్లోకము ఎంత ప్రసిద్ధమంటే పాఠశాలల నుండి ఎన్నో వ్యాపారాల వరకు తమ రోజుని ప్రారంభించేది ఈ శ్లోకముతోనే అని చెప్పేందుకు ఎలాంటి అతిశయోక్తి లేదు.

అంతటి విశిష్టమైన శుక్లాం బరధరం విష్ణుం దివ్య శ్లోకములో విఘ్నేశ్వరుని రూపము, గుణగణములను కీర్తిచటంతోపాటు ఆ గణేశుని మనసారా మన జీవితములో ఎదురైయ్యే అడ్డంకులనూ తొలగించమని వేడుకుంటాము.

పిల్లలు, పెద్దలు, అందరూ అన్ని వేళలా పఠించతగ్గ గొప్ప శ్లోకరాజం ఈ శుక్లాం బరధరం విష్ణుం. ఈ శ్లోకంతో పాటే అగజాన పద్మార్కం శ్లోకమును కూడా పఠించటం తెలుగు నాట పరిపాటిగా మారింది.

ప్రతినిత్యం ఈ శ్లోకమును అర్ధంచేసుకుని దినచర్య ప్రారంభించునపుడు కానీ, పూజా సమయములలో కానీ, ఏదైనా పనిని మొదలు పెట్టేటప్పుడు కానీ పఠించటం వల్ల విఘ్నములు తొలగిపోయి నిర్విఘ్నముగా పూర్తవుతాయని ప్రతీతి.

Suklam baradharam vishnum lyrics in telugu, a Sloka for worshipping Lord Ganesha.

Suklam baradharam Vishnum Lyrics in Telugu with Meaning – శుక్లాం బరధరం విష్ణుం

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మహే

అర్థం:

(గణేశ భగవానునికి నమస్కారములు) తెల్లని వస్త్రము ధరించి, సమస్తమూ వ్యాపించి ఉండి, చంద్రుని వలే తెల్లని వర్ణముతో వెలుగొందుచూ, నాలుగు భుజములతో
ప్రసన్నమైన ముఖము కలిగి ఉన్న విఘ్నేశ్వరా, నేను నిన్ను ధ్యానించుచున్నాను, నా జీవన మార్గము నందు ఉన్న సర్వ విఘ్నములనూ  తీసివేయుము.

Word by Word Lyrics and Meaning of Suklam Baradharam Vishnum Slokam

  • శుక్ల – తెల్లని
  • అంబర – వస్త్రము
  • ధరమ్ – ధరించిన
  • విష్ణుం – సర్వమూ వ్యాపించిఉన్న
  • శశి – చంద్రుని వంటి/ తెల్లని
  • వర్ణం – ఛాయ లేక రంగు
  • చతుర్ – నాలుగు
  • భుజం – భుజములు
  • ప్రసన్న – ప్రన్నమైన
  • వదనం – ముఖము
  • ధయేత్ – ధ్యానించుచున్నాను
  • సర్వ – అన్ని
  • విఘ్న – అడ్డంకులు
  • ఉపశాంతయే – శాంతింప చేయుము

About the author

Stotra Manjari Team

Leave a Comment