శ్రీ మహావిష్ణువు యొక్క 108 దివ్య నామాలను వివరిస్తూ సాగుతుంది విష్ణు అష్టోత్రం. చదివినా విన్నా శుభాలను చేకూర్చే ఈ విష్ణు అష్టోత్తర శతనామావళి నిత్యం పఠించతగ్గది.
వైకుంఠ వాసి అగు శ్రీ హరి యొక్క దివ్య అవతారాలను, భక్తుల పై అయన చూపు కరుణా కటాక్షాలని, లక్ష్మీదేవి, గరుత్మంతుడు, ఇత్యాది వారితో ఉన్న సాన్నిహిత్యాన్ని వివరిస్తుంది ఈ 108 నామాల విష్ణు అష్టోత్రం. ఈ నామాల నిత్యస్మరణ ద్వారా సకల దారిద్రములు తొలగుతాయి.
భగవన్నామస్మరణ మానవ జన్మకి అర్ధాన్ని చేకూరుస్తుంది అందులో విష్ణు నామాలు మరింత ప్రత్యేకమైనవి. విష్ణు అష్టోత్తర శతనామావళి పఠించటం వలన దుఃఖములు తొలగిపోయి సుఖశాంతులు కలుగుతాయి. శుభ ఫలితములు నొసంగుతాయి. శనివారం నాడు, పర్వదినాలలో, శుభసమయాలలో ఈ అష్టోత్తర పఠనం మరింత ఫలప్రదం.
Vishnu Ashtottara Shatanamavali in Telugu, Vishnu Ashtothram in Telugu – విష్ణు అష్టోత్తర శతనామావళి
- ఓం విష్ణవే నమః
- ఓం లక్ష్మీ పతయే నమః
- ఓం కృష్ణాయ నమః
- ఓం వైకుంఠాయ నమః
- ఓం గరుడ-ధ్వజాయ నమః
- ఓం పరబ్రహ్మణే నమః
- ఓం జగన్నాథాయ నమః
- ఓం వాసుదేవాయ నమః
- ఓం త్రివిక్రమాయ నమః
- ఓం దైత్యాన్తకాయ నమః
- ఓం మధురిపవే నమః
- ఓం తార్ష్యవాహాయ నమః
- ఓం సనాతనాయ నమః
- ఓం నారాయణాయ నమః
- ఓం పద్మనాభాయ నమః
- ఓం హృషీకేశాయ నమః
- ఓం సుధాప్రదాయ నమః
- ఓం మాధవాయ నమః
- ఓం పుండరీకాక్షాయ నమః
- ఓం స్థితికర్త్రే నమః
- ఓం పరాత్పరాయ నమః
- ఓం వనమాలినే నమః
- ఓం యజ్ఞ రూపాయ నమః
- ఓం చక్రపాణయే నమః
- ఓం గదాధరాయ నమః
- ఓం ఉపేంద్రాయ నమః
- ఓం కేశవాయ నమః
- ఓం హంసాయ నమః
- ఓం సముద్ర మథనాయ నమః
- ఓం హరయే నమః
- ఓం గోవిందాయ నమః
- ఓం బ్రహ్మ జనకాయ నమః
- ఓం కైటభాసుర మర్దనాయ నమః
- ఓం శ్రీధరాయ నమః
- ఓం కామ జనకాయ నమః
- ఓం శేష శాయినే నమః
- ఓం చతుర్భుజాయ నమః
- ఓం పాంచజన్యధరాయ నమః
- ఓం శ్రీమతే నమః
- ఓం శార్జపాణయే నమః
- ఓం జనార్ధనాయ నమః
- ఓం పీతాంబరధరాయ నమః
- ఓం దేవాయ నమః
- ఓం జగత్కరాయ నమః
- ఓం సూర్య చంద్ర విలోచనాయ నమః
- ఓం మత్స్య రూపాయ నమః
- ఓం కూర్మతనవే నమః
- ఓం క్రోధ రూపాయ నమః
- ఓం నృకేసరిణే నమః
- ఓం వామనాయ నమః
- ఓం భార్గవాయ నమః
- ఓం రామాయ నమః
- ఓం బలినే నమః
- ఓం కల్కినే నమః
- ఓం హయవాహనాయనమః
- ఓం విశ్వంభరాయ నమః
- ఓం శింశుమారాయ నమః
- ఓం శ్రీకరాయ నమః
- ఓం కపిలాయ నమః
- ఓం ధ్రువాయ నమః
- ఓం దత్తాత్రేయాయ నమః
- ఓం అచ్యుతాయ నమః
- ఓం అనంతాయ నమః
- ఓం ముకుందాయ నమః
- ఓం ఉదధి వాసాయ నమః
- ఓం ధన్వన్తరయే నమః
- ఓం శ్రీనివాసాయ నమః
- ఓం ప్రద్యుమ్నాయ నమః
- ఓం పురుషోత్తమాయ నమః
- ఓం శ్రీవత్స కౌస్తుభధరాయ నమః
- ఓం మురారాతయే నమః
- ఓం అధోక్షజాయ నమః
- ఓం ఋషభాయ నమః
- ఓం మోహినీ రూపధరాయ నమః
- ఓం సంకర్షణాయ నమః
- ఓం పృథవే నమః
- ఓం క్షీరాబ్ధిశాయినే నమః
- ఓం భూతాత్మనే నమః
- ఓం అనిరుద్ధాయ నమః
- ఓం భక్త వత్సలాయ నమః
- ఓం నరాయ నమః
- ఓం గజేంద్ర వరదాయ నమః
- ఓం త్రిధామ్నే నమః
- ఓం భూతభావనాయ నమః
- ఓం శ్వేతద్వీప సువాస్తవ్యాయ నమః
- ఓం సూర్య మండల మధ్యగాయ నమః
- ఓం సనకాదిముని ధ్యేయాయ నమః
- ఓం భగవతే నమః
- ఓం శంకర ప్రియాయ నమః
- ఓం నీళాకాన్తాయ నమః
- ఓం ధరాకాన్తాయ నమః
- ఓం వేదాత్మనే నమః
- ఓం బాదరాయణాయ నమః
- ఓం భాగీరథీ జన్మభూమి పాదపద్మాయ నమః
- ఓం సతాం ప్రభవే నమః
- ఓం స్వభువే నమః
- ఓం ఘనశ్యామాయ నమః
- ఓం జగత్కారణాయ నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం బుద్ధావతారాయ నమః
- ఓం శాంతాత్మనే నమః
- ఓం లీలామానుషవిగ్రహాయ నమః
- ఓం దామోదరాయ నమః
- ఓం విరాడ్రూపాయ నమః
- ఓం భూత భవ్య భవత్ ప్రభవే నమః
- ఓం ఆదిబిదేవాయ నమః
- ఓం దేవదేవాయ నమః
- ఓం ప్రహ్లాద పరిపాలకాయ నమః
ఓం శ్రీమహావిష్ణవే నమః
ఇతి శ్రీ మహా విష్ణు అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment