ఆంజనేయ స్వామి ఆరాధనలో అష్టోత్తర పూజకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఆంజనేయ అష్టోత్తరం లేక అష్టోత్తర శతనామావళిలో ఉన్న 108 నామాలలో హనుమంతున్ని గురించి ఎంతో వివరంగా చెప్పబడింది.
ఆ నామాలు ఆంజనేయ స్వామి యొక్క స్వరూపాన్ని, శక్తిని, సౌర్య పరాక్రమాలు గురించి, రాముని పై, సీతా దేవిపై ఉన్న అచంచల భక్తిని, భక్తుల పై స్వామికి ఉండే వాత్సల్యాన్ని, ఇలా ఎన్నో గుణాలను వివరిస్తుంటాయి.
ఆంజనేయ అష్టోత్తర శతనామావళి నిత్యము పఠించటం ఎంతో శుభప్రదమైనది. మంచి ఆరోగ్యం కొరకు, శత్రు బాధలనుండి, తెలియని భయాల నుండి రక్షించుకొనుటకొరకు ఈ ఆంజనేయ అష్టోత్తరం పారాయణ ఎంతో ఉపయోపడుతుంది.
ఆంజనేయ అష్టోత్తరం – ఆంజనేయ అష్టోత్తర శతనామావళి – 108 నామాలు
- ఓం ఆంజనేయాయ నమః
- ఓం మహావీరాయ నమః
- ఓం హనుమతే నమః
- ఓం మారుతాత్మజాయ నమః
- ఓం తత్త్వజ్ఞాన ప్రదాయ నమః
- ఓం సీతాదేవీముద్రా ప్రదాయకాయ నమః
- ఓం అశోకవనికాచ్చేత్రే నమః
- ఓం సర్వమాయా విభంజనాయ నమః
- ఓం సర్వబంధ విమోక్త్రే నమః
- ఓం రక్షో విధ్వంస కారకాయనమః
- ఓం పరవిద్యా పరిహారాయ నమః
- ఓం పరశౌర్య వినాశనాయ నమః
- ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః
- ఓం పరయంత్ర ప్రభేదకాయ నమః
- ఓం సర్వగ్రహ వినాశినే నమః
- ఓం భీమసేన సహాయకృతే నమః
- ఓం సర్వదుఃఖ హరాయ నమః
- ఓం సర్వలోక చారిణే నమః
- ఓం మనోజవాయ నమః
- ఓం పారిజాత ద్రుమూలస్థాయ నమః
- ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః
- ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః
- ఓం సర్వ మంత్రాత్మకయ నమః
- ఓం కపీశ్వరాయ నమః
- ఓం మహాకాయాయ నమః
- ఓం సర్వరోగ హరాయ నమః
- ఓం ప్రభవే నమః
- ఓం బలసిద్ధికరాయ నమః
- ఓం సర్వవిద్యా సంపత్ప్రదాయకాయ నమః
- ఓం కపిసేనా నాయకాయ నమః
- ఓం భవిష్యచ్చతురాననాయ నమః
- ఓం కుమార బ్రహ్మచారిణే నమః
- ఓం రత్నకుండల దీప్తిమతే నమః
- ఓం సంచలద్వాల సన్నద్ధలంబ మానః శిఖోజ్జ్వలాయ నమః
- ఓం గంధర్వ విద్యాతత్త్వజ్ఞాయ నమః
- ఓం మహాబల పరాక్రమాయ నమః
- ఓం కారాగృహ విమోక్త్రే నమః
- ఓం శృంఖలాబంధ మోచకాయ నమః
- ఓం సాగరోత్తారకాయ నమః
- ఓం ప్రాజ్ఞాయ నమః
- ఓం రామ దూతాయ నమః
- ఓం ప్రతాపవతే నమః
- ఓం వానరాయ నమః
- ఓం కేసరీ సుతాయ నమః
- ఓం సీతాశోక నివారనాయ నమః
- ఓం అంజనాగర్భ సంభూతాయ నమః
- ఓం బాలార్క సదృశాననాయ నమః
- ఓం విభీషణ ప్రియకరాయ నమః
- ఓం దశగ్రీవ కులాంతకాయ నమః
- ఓం లక్ష్మణ ప్రాణదాత్రే నమః
- ఓం వజ్రకాయాయ నమః
- ఓం మహాద్యుతయే నమః
- ఓం చిరంజీవినే నమః
- ఓం రామభక్తాయ నమః
- ఓం దైత్యకార్య విఘాతకాయ నమః
- ఓం అక్షహంత్రే నమః
- ఓం కాంచనాభాయ నమః
- ఓం పంచవక్త్రాయ నమః
- ఓం మహాతపసే నమః
- ఓం లంకిణీ భంజనాయ నమః
- ఓం శ్రీమతే నమః
- ఓం సింహికాప్రాణ భంజనాయ నమః
- ఓం గంధమాదన శైలస్థాయ నమః
- ఓం లంకాపుర విదాహకాయ నమః
- ఓం సుగ్రీవ సచివాయ నమః
- ఓం ధీరాయ నమః
- ఓం శూరాయ నమః
- ఓం దైత్య కులాంతకాయ నమః
- ఓం సురార్చితాయ నమః
- ఓం మహాతేజసే నమః
- ఓం రామ-చూడామణి ప్రదాయ నమః
- ఓం కామరూపిణే నమః
- ఓం పింగళాక్షాయ నమః
- ఓం వార్ధిమైనాక పూజితాయ నమః
- ఓం కబళీకృత మార్తాండ మండలాయ నమః
- ఓం విజితేంద్రియాయ నమః
- ఓం రామ-సుగ్రీవ సంధాత్రే నమః
- ఓం మహారావణ మర్దనాయ నమః
- ఓం స్ఫటికాభాయ నమః
- ఓం వాగధీశాయ నమః
- ఓం నవవ్యాకృతి పండితాయ నమః
- ఓం చతుర్బాహవే నమః
- ఓం దీనబంధవే నమః
- ఓం మహాత్మనే నమః
- ఓం భక్త వత్సలాయ నమః
- ఓం సంజీవన-నగాహర్త్రే నమః
- ఓం శుచయే నమః
- ఓం వాగ్మినే నమః
- ఓం దృఢవ్రతాయ నమః
- ఓం కాలనేమి ప్రమథనాయ నమః
- ఓం హరిమర్కట మర్కటాయ నమః
- ఓం దాంతాయ నమః
- ఓం శాంతాయ నమః
- ఓం ప్రసన్నాత్మనే నమః
- ఓం శతకంఠ మదాపహృతే నమః
- ఓం యోగినే నమః
- ఓం రామకథా లోలాయ నమః
- ఓం సీతాన్వేషణ పండితాయ నమః
- ఓం వజ్రదంష్ట్రాయ నమః
- ఓం వజ్రనఖాయ నమః
- ఓం రుద్రవీర్య సముద్భవాయ నమః
- ఓం ఇంద్రజిత్ప్రహితామోఘ బ్రహ్మాస్త్ర నివారకాయ నమః
- ఓం పార్థధ్వజాగ్ర సంవాసినే నమః
- ఓం శరపంజర భేదకాయ నమః
- ఓం దశబాహవే నమః
- ఓం లోకపూజ్యాయ నమః
- ఓం జాంబవత్ప్రీతి వర్ధనాయ నమః
- ఓం సీతాసమేత శ్రీరామపాద సేవాదురంధరాయ నమః
ఇతి శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామావళి సంపూర్ణమ్
Leave a Comment