ధాన్యాన్ని, ఆరోగ్యాన్ని,ఆయుష్షుని ప్రసాదించే అన్నపూర్ణా దేవిని ప్రార్ధించేందుకు అన్నపూర్ణా అష్టోత్రం లేక అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఈ అన్నపూర్ణా అష్టోత్రం 108 దివ్య నామములతో దేవి వైభవాన్ని వివరిస్తుంది. అనేక దేవి రూపాలను, మరెన్నో గాధలను, దేవి గుణగణాలనూ వివరిస్తు సాగుతుంది ఈ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి.
పార్వతీ దేవి యొక్క కరుణా రూపమే అన్నపూర్ణా దేవి. అమ్మ అని పిలిస్తే చాలు ఆకలి బాధను తీర్చి తరతరాలకూ తీరని సిరి సంపదలను ప్రసాదిస్తుంది ఈ దేవి.
మహాశివునికి సైతం ఆహారాన్ని అందించి ఆశీస్సులు పొంది ప్రపంచానికి శివుడు మరియు శక్తి కలయిక తోనే ఈ విశ్వానికి స్థిరత్వం ఉంటుంది అన్న నిగూఢ అర్ధాన్ని తెలిపిన దైవం అన్నపూర్ణా దేవి.
అట్టి దేవి వైభవాన్ని చాటిచెప్పే అన్నపూర్ణా అష్టోత్రం పఠించటం ఎంతో శ్రేయస్కరం.

Sri Annapurna Ashtothram in Telugu – Annapurna Ashtottara Shatanamavali శ్రీ అన్నపూర్ణా అష్టోత్రం అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి
- ఓం అన్నపూర్ణాయై నమః
- ఓం శివాయై నమః
- ఓం భీమాయై నమః
- ఓం పుష్ట్యై నమః
- ఓం సరస్వత్యై నమః
- ఓం సర్వజ్ఞాయై నమః
- ఓం పార్వత్యై నమః
- ఓం దుర్గాయై నమః
- ఓం శర్వాణ్యై నమః
- ఓం శివవల్లభాయై నమః
- ఓం వేదవేద్యాయై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం విద్యాదాత్రై నమః
- ఓం విశారదాయై నమః
- ఓం కుమార్యై నమః
- ఓం త్రిపురాయై నమః
- ఓం బాలాయై నమః
- ఓం లక్ష్మ్యై నమః/ ఓం శ్రియై నమః
- ఓం భయహారిణ్యై నమః
- ఓం భవాన్యై నమః
- ఓం విశ్వజనన్యై నమః
- ఓం బ్రహ్మాదిజనన్యై నమః
- ఓం గణేశజనన్యై నమః
- ఓం శక్త్యై నమః
- ఓం కుమారజనన్యై నమః
- ఓం శుభాయై నమః
- ఓం భోగప్రదాయై నమః
- ఓం భగవత్యై నమః
- ఓం భక్తాభీష్ట ప్రదాయిన్యై నమః
- ఓం భవ్యాయై నమః
- ఓం శుభ్రాయై నమః
- ఓం పరమ మంగళాయై నమః
- ఓం భవాన్యై నమః
- ఓం చంచలాయై నమః/ ఓం గౌర్యై నమః
- ఓం చారు-చంద్రకళాధరాయై నమః
- ఓం విశాలాక్ష్యై నమః
- ఓం విశ్వమాత్రే నమః
- ఓం విశ్వవంద్యాయై నమః
- ఓం విలాసిన్యై నమః
- ఓం ఆర్యాయై నమః
- ఓం కళ్యాణ నిలాయాయై నమః
- ఓం రుద్రాణ్యై నమః
- ఓం కమలాసనాయై నమః
- ఓం శుభప్రదాయై నమః
- ఓం శుభాయై నమః
- ఓం అనంతాయై నమః
- ఓం వృత్తపీన పయోధరాయై నమః
- ఓం అంబాయై నమః
- ఓం సంహారమథన్యై నమః
- ఓం మృడాన్యై నమః
- ఓం సర్వమంగళాయై నమః
- ఓం విష్ణు సంసేవితాయై నమః
- ఓం సిద్ధాయై నమః
- ఓం బ్రహ్మాణ్యై నమః
- ఓం సురసేవితాయై నమః
- ఓం పరమానందదాయై నమః
- ఓం శాంత్యై నమః
- ఓం పరమానంద రూపిణ్యై నమః
- ఓం పరమానంద జనన్యై నమః
- ఓం పరాయై నమః
- ఓం ఆనంద ప్రదాయిన్యై నమః
- ఓం పరోపకార నిరతాయై నమః
- ఓం పరమాయై నమః
- ఓం భక్తవత్సలాయై నమః
- ఓం పూర్ణచంద్రాభ వదనాయై నమః
- ఓం పూర్ణచంద్రనిభాంశుకాయై నమః
- ఓం శుభలక్షణ సంపన్నాయై నమః
- ఓం శుభానంద గుణార్ణవాయై నమః
- ఓం శుభ సౌభాగ్య నిలయాయై నమః
- ఓం శుభదాయై నమః
- ఓం రతిప్రియాయై నమః
- ఓం చండికాయై నమః
- ఓం చండమథన్యై నమః
- ఓం చండదర్ప నివారిణ్యై నమః
- ఓం మార్తాండ నయనాయై నమః
- ఓం సాధ్వ్యై నమః
- ఓం చంద్రాగ్ని నయనాయై నమః
- ఓం సత్యై నమః
- ఓం పుండరీకహరాయై నమః
- ఓం పూర్ణాయై నమః
- ఓం పుణ్యదాయై నమః
- ఓం పుణ్యరూపిణ్యై నమః
- ఓం మాయాతీతాయై నమః
- ఓం శ్రేష్ఠమాయాయై నమః
- ఓం శ్రేష్ఠ ధర్మాత్మ వందితాయై నమః
- ఓం అసృష్ట్యై నమః
- ఓం సంగరహితాయై నమః
- ఓం సృష్టిహేతవే నమః
- ఓం కపర్దిన్యై నమః
- ఓం వృషారూఢాయై నమః
- ఓం శూల హస్తాయై నమః
- ఓం స్థితి సంహార కారిణ్యై నమః
- ఓం మందస్మితాయై నమః
- ఓం స్కందమాత్రే నమః
- ఓం శుద్ధచిత్తాయై నమః
- ఓం ముని స్తుతాయై నమః
- ఓం మహాభగవత్యై నమః
- ఓం దక్షాయై నమః
- ఓం దక్షాధ్వర వినాశిన్యై నమః
- ఓం సర్వార్థ దాత్ర్యై నమః
- ఓం సావిత్ర్యై నమః
- ఓం సదాశివ కుటుంబిన్యై నమః
- ఓం నిత్య సుందర సర్వాంగ్యై నమః
- ఓం సచ్చిదానంద లక్షణాయై నమః
- ఓం సర్వదేవతా సంపూజ్యాయై నమః
- ఓం శంకర ప్రియ వల్లభాయై నమః
- ఓం సర్వాధారాయై నమః
- ఓం మహాసాద్వ్యై నమః
ఇతి శ్రీ అన్నపూర్ణా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment