Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Sri Gayatri Ashtottara Shatanamavali in Telugu (Ashtothram) – శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి

వేదమాత అగు గాయత్రీ దేవి నిత్య ఆరాధనలో సుప్రసిద్ధమైన గాయత్రీ మంత్రంతో పాటుగా గాయత్రీ అష్టోత్తర శతనామావళి కి కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది.

108 నామములున్న గాయత్రీ అష్టోత్రం గాయత్రీదేవి యొక్క శక్తినీ, రూపాన్ని, దైవిక గుణగణాలనూ వివరిస్తుంటాయి. వీటితోపాటు గాయత్రీ వైభవాన్ని, శక్తిమాత యొక్క అనేక రూపములుగా పిలవబడుతున్న ఇతర దేవీదేవతల నామములూ ఉన్నాయి.

గురు, శుక్రవారములలో, పర్వదినముల యందు విశేషించి గాయత్రీ జయంతి, దసరా రోజులలో, తప్పక పఠించతగ్గ అష్టోత్రం ఈ గాయత్రీ అష్టోత్రం. ప్రతి రోజూ సైతం పఠించవచ్చు.

ఎన్నో విశేషములున్న ఈ గాయత్రీ అష్టోత్తర శతనామావళి చదువుతూ దయాణించటం ద్వారా చేపట్టే పనులు దేవి కృపవల్ల తప్పక జయప్రదం అవుతాయి.

Gayatri Ashtottara Shatanamavali in Telugu - Gayatri Ashtothram in Telugu of Goddess Gayatri Devi.

Gayatri Ashtottara Shatanamavali in Telugu – Gayatri Ashtothram గాయత్రీ అష్టోత్తర శతనామావళి తెలుగులో – గాయత్రీ అష్టోత్రం

  1. ఓం తరుణాదిత్య సంకాశాయై నమః
  2. ఓం సహస్ర నయనోజ్జ్వలాయై నమః
  3. ఓం విచిత్ర మాల్యాభరణాయై నమః
  4. ఓం తుహినాచలవాసిన్యై నమః
  5. ఓం వరదాభయ హస్తాబ్జాయై నమః
  6. ఓం రేవాతీర నివాసిన్యై నమః
  7. ఓం ప్రణిత్యయ విశేషజ్ఞాయై నమః
  8. ఓం యంత్రాకృతవి రాజితాయై నమః
  9. ఓం భద్రపాద ప్రియాయై నమః
  10. ఓం గోవిందపదగామిన్యై నమః
  11. ఓం దేవర్షిగణ సంతుష్టాయై నమః
  12. ఓం వనమాలావి భూషితాయై నమః
  13. ఓం స్యందనోత్తమ సంస్థానాయై నమః
  14. ఓం ధీరజీమూతనిస్వనాయై నమః
  15. ఓం మత్తమాతంగ గమనాయై నమః
  16. ఓం హిరణ్య-కమలాసనాయై నమః
  17. ఓం ధీజనాధార నిరతాయై నమః
  18. ఓం యోగిన్యై నమః
  19. ఓం యోగధారిణ్యై నమః
  20. ఓం నటనాట్యైక నిరతాయై నమః
  21. ఓం ప్రణవాద్యక్షరాత్మికాయై నమః
  22. ఓం చోరచారక్రియాసక్తాయై నమః
  23. ఓం దారిద్ర్యచ్ఛేదకారిణ్యై నమః
  24. ఓం యాదవేంద్ర కులోద్భూతాయై నమః
  25. ఓం తురీయ పథగామిన్యై నమః
  26. ఓం గాయత్ర్యై నమః
  27. ఓం గోమత్యై నమః
  28. ఓం గంగాయై నమః
  29. ఓం గౌతమ్యై నమః
  30. ఓం గరుడాసనాయై నమః
  31. ఓం గేయగాన-ప్రియాయై నమః
  32. ఓం గౌర్యై నమః
  33. ఓం గోవిందపద పూజితాయై నమః
  34. ఓం గంధర్వ నగరాకారాయై నమః
  35. ఓం గౌరవర్ణాయై నమః
  36. ఓం గణేశ్వర్యై నమః
  37. ఓం గుణాశ్రయాయై నమః
  38. ఓం గుణవత్యై నమః
  39. ఓం గహ్వర్యై నమః
  40. ఓం గణపూజితాయై నమః
  41. ఓం గుణత్రయ సమాయుక్తాయై నమః
  42. ఓం గుణత్రయ వివర్జితాయై నమః
  43. ఓం గుహావాసాయై నమః
  44. ఓం గుణాధారాయై నమః
  45. ఓం గుహ్యాయై నమః
  46. ఓం గంధర్వ-రూపిణ్యై నమః
  47. ఓం గార్గ్యప్రియాయై నమః
  48. ఓం గురుపదాయై నమః
  49. ఓం గుహ్యలింగాంగ-ధారిణ్యై నమః
  50. ఓం సావిత్ర్యై నమః
  51. ఓం సూర్య తనయాయై నమః
  52. ఓం సుషుమ్నానాడి-భేదిన్యై నమః
  53. ఓం సుప్రకాశాయై నమః
  54. ఓం సుఖాసీనాయై నమః
  55. ఓం సుమత్యై నమః
  56. ఓం సురపూజితాయై నమః
  57. ఓం సుషుప్త్యవస్థాయై నమః
  58. ఓం సుదత్యై నమః
  59. ఓం సుందర్యై నమః
  60. ఓం సాగరాంబరాయై నమః
  61. ఓం సుధాంశుబింబ వదనాయై నమః
  62. ఓం సుస్తన్యై నమః
  63. ఓం సువిలోచనాయై నమః
  64. ఓం సీతాయై నమః
  65. ఓం సర్వాశ్రయాయై నమః
  66. ఓం సంధ్యాయై నమః
  67. ఓం సుఫలాయై నమః
  68. ఓం సుఖదాయిన్యై నమః
  69. ఓం సుభ్రువే నమః
  70. ఓం సువాసాయై నమః
  71. ఓం సుశ్రోణ్యై నమః
  72. ఓం సంసారార్ణవ తారిణ్యై నమః
  73. ఓం సామగాన ప్రియాయై నమః
  74. ఓం సాధ్వ్యై నమః
  75. ఓం సర్వాభరణ భూషితాయై నమః
  76. ఓం వైష్ణవ్యై నమః
  77. ఓం విమలాకారాయై నమః
  78. ఓం మహేంద్ర్యై నమః
  79. ఓం మంత్రరూపిణ్యై నమః
  80. ఓం మహాలక్ష్మ్యై నమః
  81. ఓం మహాసిద్ధ్యై నమః
  82. ఓం మహామాయాయై నమః
  83. ఓం మహేశ్వర్యై నమః
  84. ఓం మోహిన్యై నమః
  85. ఓం మదనాకారాయై నమః
  86. ఓం మధుసూదన చోదితాయై నమః
  87. ఓం మీనాక్ష్యై నమః
  88. ఓం మధురావాసాయై నమః
  89. ఓం నాగేంద్ర తనయాయై నమః
  90. ఓం ఉమాయై నమః
  91. ఓం త్రివిక్రమ పదాక్రాంతాయై నమః
  92. ఓం త్రిస్వరాయై నమః
  93. ఓం త్రివిలోచనాయై నమః
  94. ఓం సూర్యమండల-మధ్యస్థాయై నమః
  95. ఓం చంద్రమండల-సంస్థితాయై నమః
  96. ఓం వహ్నిమండల-మధ్యస్థాయై నమః
  97. ఓం వాయుమండల-సంస్థితాయై నమః
  98. ఓం వ్యోమమండల-మధ్యస్థాయై నమః
  99. ఓం చక్రిణ్యై నమః
  100. ఓం చక్రరూపిణ్యై నమః
  101. ఓం కాలచక్రవితానస్థాయై నమః
  102. ఓం చంద్రమండల దర్పణాయై నమః
  103. ఓం జ్యోత్స్నాతపానులిప్తాంగ్యై నమః
  104. ఓం మహామారుతవీజితాయై నమః
  105. ఓం సర్వమంత్రాశ్రయాయై నమః
  106. ఓం ధేనవే నమః
  107. ఓం పాపఘ్న్యై నమః
  108. ఓం పరమేశ్వర్యై నమః

ఇతి శ్రీ గాయత్రీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

About the author

Stotra Manjari Team

Leave a Comment