మహాలక్ష్మి దేవి అవతారంగా కొలువబడే తల్లి ఆండాళ్ లేక గోదా దేవి. అట్టి దేవి యొక్క మహిమాన్వితమైన గోదా అష్టోత్రం లేక గోదా అష్టోత్తర శతనామావళి ప్రతి నిత్యము పఠించటం వల్ల సిరి సంపదలు పెరగటమే కాక విష్ణు కటాక్షం సైతం లభిస్తుందని పెద్దల మాట.
శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గోదా దేవికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. 12మంది ఆళ్వార్లలో ఒకరైన గోదా దేవి, విష్ణు భక్తిని నలుదిశలా వ్యాప్తి చేసేందుకు ఎంతగానో కృషిచేశారు.
ధనుర్మాసంలో సంప్రదాయాన్ని అనుసరించి ఎందరో వైష్ణవులు ప్రతి రోజు గోదా దేవిని పూజిస్తు, తిరుప్పావై పఠనం చేస్తారు. అట్టి పూజా సమయములలో గోదా దేవిని ప్రార్ధించేందుకు ఎందరో భక్తులు గోదా అష్టోత్రం లోని 108 నామములను పఠిస్తుంటారు.
గోదా అష్టోత్రం లేక గోదా అష్టోత్తర శతనామావళిలోని నామములు ఈ దేవిని విశేషముగా కీర్తిస్తూ, గోదా వైభవమును, భక్తిని, గుణగణాలను మరెన్నో వివరములనూ వివరిస్తూ సాగుతుంటాయి.
Sri Goda Ashtothram in Telugu – Goda Devi Ashtottara Shatanamavali in Telugu గోదా అష్టోత్రం – గోదా దేవి అష్టోత్తర శతనామావళి
- ఓం శ్రీరంగ నాయక్యై నమః
- ఓం గోదాయై నమః
- ఓం విష్ణు చిత్తాత్మజాయై నమః
- ఓం సత్యై నమః
- ఓం గోపీవేషధరాయై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం భూసుతాయై నమః
- ఓం భోగశాలిన్యై నమః
- ఓం తులసీకాననోద్భూతాయై నమః
- ఓం శ్రీధన్విపురవాసిన్యై నమః
- ఓం భట్టనాథ ప్రియకర్యై నమః
- ఓం శ్రీకృష్ణ హితభోగిన్యై నమః
- ఓం ఆముక్తమాల్యదాయై నమః
- ఓం బాలాయై నమః
- ఓం రంగనాథ ప్రియాయై నమః
- ఓం పరాయై నమః
- ఓం విశ్వంభరాయై నమః
- ఓం కలాలాపాయై నమః
- ఓం యతిరాజ సహోదర్యై నమః
- ఓం కృష్ణానురక్తాయై నమః
- ఓం సుభగాయై నమః
- ఓం సులభశ్రియై నమః
- ఓం సులక్షణాయై నమః
- ఓం లక్ష్మీప్రియసఖ్యై నమః
- ఓం శ్యామాయై నమః
- ఓం దయాంచిత దృగంచలాయై నమః
- ఓం ఫల్గున్యావిర్భవాయై నమః
- ఓం రమ్యాయై నమః
- ఓం ధనుర్మాస కృతవ్రతాయై నమః
- ఓం చంపకాశోకపున్నాగ మాలతీ విలసత్కచాయై నమః
- ఓం ఆకారత్రయ సంపన్నాయై నమః
- ఓం నారాయణ పదాశ్రితాయై నమః
- ఓం శ్రీమదష్టాక్షరీ మంత్రరాజస్థిత మనోరథాయై నమః
- ఓం మోక్షప్రదాన నిపుణాయై నమః
- ఓం మనురత్నాధి దేవతాయై నమః
- ఓం బ్రహ్మణ్యాయై నమః
- ఓం లోకజనన్యై నమః
- ఓం లీలామానుషరూపిణ్యై నమః
- ఓం బ్రహ్మజ్ఞాన ప్రదాయై నమః
- ఓం మాయాయై నమః
- ఓం సచ్చిదానంద విగ్రహాయై నమః
- ఓం మహాపతివ్రతాయై నమః
- ఓం విష్ణుగుణకీర్తన లోలుపాయై నమః
- ఓం ప్రపన్నార్తిహరాయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం వేదసౌధ విహారిణ్యై నమః
- ఓం శ్రీరంగనాథ మాణిక్యమంజర్యై నమః
- ఓం మంజుభాషిణ్యై నమః
- ఓం పద్మప్రియాయై నమః
- ఓం పద్మహస్తాయై నమః
- ఓం వేదాంతద్వయబోధిన్యై నమః
- ఓం సుప్రసన్నాయై నమః
- ఓం భగవత్యై నమః
- ఓం శ్రీజనార్దనదీపికాయై నమః
- ఓం సుగంధావయవాయై నమః
- ఓం చారురంగమంగల దీపికాయై నమః
- ఓం ధ్వజవజ్రాంకుశాబ్జాంక మృదుపాద తలాంచితాయై నమః
- ఓం తారకాకారనఖరాయై నమః
- ఓం ప్రవాళ మృదులాంగుళ్యై నమః
- ఓం కూర్మోపమేయ పాదోర్ధ్వభాగాయై నమః
- ఓం శోభనపార్ష్ణికాయై నమః
- ఓం వేదార్థ భావతత్త్వజ్ఞ లోకారాధ్యాంఘ్రి పంకజాయై నమః
- ఓం ఆనంద బుద్బుదాకార సుగుల్ఫాయై నమః
- ఓం పరమాణుకాయై నమః
- ఓం తేజఃశ్రియోజ్జ్వల ధృతపాదాంగుళి సుభూషితాయై నమః
- ఓం మీనకేతనతూణీర చారుజంఘా విరాజితాయై నమః
- ఓం కకుద్వజ్జాను యుగ్మాఢ్యాయై నమః
- ఓం స్వర్ణరంభాభసక్థికాయై నమః
- ఓం విశాలజఘనాయై నమః
- ఓం పీనసుశ్రోణ్యై నమః
- ఓం మణిమేఖలాయై నమః
- ఓం ఆనందసాగరావర్త గంభీరాంభోజ నాభికాయై నమః
- ఓం భాస్వద్వలిత్రికాయై నమః
- ఓం చారుజగత్పూర్ణ మహోదర్యై నమః
- ఓం నవవల్లీ రోమరాజ్యై నమః
- ఓం సుధాకుంభాయితస్తన్యై నమః
- ఓం కల్పమాలానిభభుజాయై నమః
- ఓం చంద్రఖండన ఖాంచితాయై నమః
- ఓం సుప్రవాశాంగుళీన్యస్త మహారత్నాంగుళీయకాయై నమః
- ఓం నవారుణ ప్రవాలాభ పాణిదేశ సమంచితాయై నమః
- ఓం కంబుకంఠ్యై నమః
- ఓం సుచుబుకాయై నమః
- ఓం బింబోష్ఠ్యై నమః
- ఓం కుందదంతయుజే నమః
- ఓం కారుణ్యరసనిష్యంద నేత్రద్వయసుశోభితాయై నమః
- ఓం ముక్తాశుచిస్మితాయై నమః
- ఓం చారుచాంపేయ నిభనాసికాయై నమః
- ఓం దర్పణాకార విపులకపోల ద్వితయాంచితాయై నమః
- ఓం అనంతార్కప్రకాశోద్యన్మణి తాటంకశోభితాయై నమః
- ఓం కోటిసూర్యాగ్ని సంకాశ నానాభూషణభూషితాయై నమః
- ఓం సుగంధవదనాయై నమః
- ఓం సుభ్రువే నమః
- ఓం అర్ధచంద్రలలాటికాయై నమః
- ఓం పూర్ణచంద్రాననాయై నమః
- ఓం నీలకుటిలాలక శోభితాయై నమః
- ఓం సౌందర్యసీమాయై నమః
- ఓం విలసత్కస్తూరీ తిలకోజ్జ్వలాయై నమః
- ఓం ధగద్ధగాయమానోద్యన్మణి సీమంతభూషణాయై నమః
- ఓం జాజ్వల్యమానసద్రత్న దివ్యచూడావతంసకాయై నమః
- ఓం సూర్యార్ధచంద్రవిలసత్ భూషణంచిత వేణికాయై నమః
- ఓం అత్యర్కానల తేజోధిమణి కంచుకధారిణ్యై నమః
- ఓం సద్రత్నాంచిత విద్యోత విద్యుత్కుంజాభ శాటికాయై నమః
- ఓం నానామణిగణాకీర్ణ హేమాంగద సుభూషితాయై నమః
- ఓం కుంకుమాగరు కస్తూరీ దివ్యచందన చర్చితాయై నమః
- ఓం స్వోచితౌజ్జ్వల్య వివిధ-విచిత్రమణిహారిణ్యై నమః
- ఓం అసంఖ్యేయ సుఖస్పర్శ సర్వాతిశయ భూషణాయై నమః
- ఓం మల్లికాపారిజాతాది దివ్యపుష్పస్రగంచితాయై నమః
- ఓం శ్రీరంగనిలయాయై నమః
ఓం పూజ్యాయై నమః
ఓం దివ్యదేశసుశోభితాయై నమః
ఇతి శ్రీ గోదా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment