జగన్మాత అగు పార్వతీ దేవి వైభవాన్ని చాటిచెప్పే 108 నామములే ఈ పార్వతీ అష్టోత్తర శతనామావళి లేక పార్వతి అష్టోత్రం.
దుర్గ, కాళీ, చండి, మొదలగు శక్తి రూపాలకు మూలము పార్వతీ దేవి.
శత్రు సంహారినిగానే కాక మంగళ ప్రదాయినిగా, ఆర్త జన రక్షకురాలిగా, భక్తాభీష్ట వరప్రదాయినిగా పేరొందిన శక్తి స్వరూపము పార్వతీ మాత.
ముల్లోకాలనూ శాశించగల శివ భగవానుని భార్యగా, తొలిపూజలందుకొనే గణేశుని మరియూ దేవ సేనాపతి అగు కుమార స్వామి తల్లిగా పార్వతీ మాత గొప్పతనము వర్ణించలేనిది.
అట్టి పార్వతీ దేవి శక్తిని, రూపమునూ, గుణగణాలనూ, కీర్తిస్తూ సాగుతుంది పార్వతీ అష్టోత్తర శతనామావళి.
ఎల్లవేళలా పఠించతగ్గ ఈ 108 నామములు భక్తులకు సౌభాగ్యమును, సిరిసంపదలను, భోగభాగ్యములను ప్రసాదిస్తాయి.
Sri Parvati Ashtottara Shatanamavali in Telugu- Parvati Ashtothram- 108 names శ్రీ పార్వతీ అష్టోత్తర శతనామావళి
- ఓం పార్వత్యై నమః
- ఓం మహా దేవ్యై నమః
- ఓం జగన్మాత్రే నమః
- ఓం సరస్వత్యై నమహ్
- ఓం చండికాయై నమః
- ఓం లోకజనన్యై నమః
- ఓం సర్వ దేవాధి దేవతాయై నమః
- ఓం గౌర్యై నమః
- ఓం పరమాయై నమః
- ఓం ఈశాయై నమః
- ఓం నాగేంద్ర తనయాయై నమః
- ఓం సత్యై నమః
- ఓం బ్రహ్మచారిణ్యై నమః
- ఓం శర్వాణ్యై నమః
- ఓం దేవమాత్రే నమః
- ఓం త్రిలోచన్యై నమః
- ఓం బ్రహ్మణ్యై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం రౌద్ర్యై నమః
- ఓం కాళరాత్ర్యై నమః
- ఓం తపస్విన్యై నమః
- ఓం శివదూత్యై నమః
- ఓం విశాలాక్ష్యై నమః
- ఓం చాముండాయై నమః
- ఓం విష్ణు సోదర్యై నమః
- ఓం చిత్కళాయై నమః
- ఓం చిన్మయాకారాయై నమః
- ఓం మహిషాసురమర్దిన్యై నమః
- ఓం కాత్యాయిన్యై నమః
- ఓం కాలరూపాయై నమః
- ఓం గిరిజాయై నమః
- ఓం మేనకాత్మజాయై నమః
- ఓం భవాన్యై నమః
- ఓం మాతృకాయై నమః
- ఓం శ్రీమాత్రేనమః
- ఓం మహాగౌర్యై నమః
- ఓం రమాయై నమః
- ఓం శుచిస్మితాయై నమః
- ఓం బ్రహ్మస్వరూపిణ్యై నమః
- ఓం రాజ్యలక్ష్మ్యై నమః
- ఓం శివ ప్రియాయై నమః
- ఓం నారాయణ్యై నమః
- ఓం మాహా శక్త్యై నమః
- ఓం నవోఢాయై నమః
- ఓం భగ్యదాయిన్యై నమః
- ఓం అన్నపూర్ణాయై నమః
- ఓం సదానందాయై నమః
- ఓం యౌవనాయై నమః
- ఓం మోహిన్యై నమః
- ఓం అజ్ఞానశుధ్యై నమః
- ఓం జ్ఞానగమ్యాయై నమః
- ఓం నిత్యాయై నమః
- ఓం నిత్య స్వరూపిణ్యై నమః
- ఓం కమలాయై నమః
- ఓం కమలాకారాయై నమః
- ఓం రక్తవర్ణాయై నమః
- ఓం కళానిధియై నమః
- ఓం మధు ప్రియాయై నమః
- ఓం కళ్యాణ్యై నమః
- ఓం కరుణాయై నమః
- ఓం జనస్థానాయై నమః
- ఓం వీరపత్న్యై నమః
- ఓం విరూపాక్ష్యై నమః
- ఓం వీరాధితాయై నమః
- ఓం హేమాభాసాయై నమః
- ఓం సృష్తి రూపాయై నమః
- ఓం సృష్తి సంహార కారిన్యై నమః
- ఓం రంజనాయై నమః
- ఓం యౌవనాకారాయై నమః
- ఓం పరమేశ ప్రియాయై నమః
- ఓం పరాయై నమః
- ఓం పుష్పిణ్యై నమః
- ఓం పుష్ప కారాయై నమః
- ఓం పురుషార్థ ప్రదాయిన్యై నమః
- ఓం మహా రూపాయై నమః
- ఓం మహా రౌద్ర్యై నమః
- ఓం కామాక్ష్యై నమః
- ఓం వామదేవ్యై నమః
- ఓం వరదాయై నమః
- ఓం భయ నాశిన్యై నమః
- ఓం వాగ్దేవ్యై నమః
- ఓం వచన్యై నమః
- ఓం వారాహ్యై నమః
- ఓం విశ్వతోషిన్యై నమః
- ఓం వర్ధనీయాయై నమః
- ఓం విశాలాక్షాయై నమః
- ఓం కుల సంపత్ ప్రదాయిన్యై నమః
- ఓం ఆర్త దుఖఃచ్చేద దక్షాయై నమః
- ఓం అంబాయై నమః
- ఓం నిఖిల యోగిన్యై నమః
- ఓం సదాపురస్థాయిన్యై నమః
- ఓం తరోర్మూల తలంగతాయై నమః
- ఓం హరవాహ సమాయుక్తయై నమః
- ఓం మోక్షపరాయణాయై నమః
- ఓం ధరాధరభవాయై నమః
- ఓం ముక్తాయై నమః
- ఓం వర మంత్రాయై నమః
- ఓం కరప్రదాయై నమః
- ఓం వాగ్భవ్యై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం క్లీం కారిణ్యై నమః
- ఓం సంవిదే నమః
- ఓం ఈశ్వర్యై నమః
- ఓం హ్రీంకారబీజాయై నమః
- ఓం శాంభవ్యై నమః
- ఓం ప్రణవాత్మికాయై నమః
- ఓం శుభప్రదాయై నమః
- ఓం శ్రీ మహాగౌర్యై నమః
ఇతి పార్వతీ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment