రామ నామస్మరణకు ఎంతో విశిష్టత ఉంది. మరి ఆ రాముని 108 దివ్య నామాల కూర్పుగా ఉన్న శ్రీ రామ అష్టోత్తర శతనామావళి లేక రామ అష్టోత్రం యొక్క విశిష్టత మాటలతో వర్ణించలేనిది.
శ్రీ రాముని గుణగణాలనూ, గొప్పతనాన్ని వివరిస్తూ అనేకానేక జీవిత విశేషాలనూ గుర్తుచేస్తూ సాగుతుంటాయి రామ అష్టోత్తర శతనామావళి లోని నామములు.
ఈ అష్టోత్రం పఠనము కూడా రామకథా శ్రవణములాంటిదే అని చెప్పుట అతిశయోక్తి కాదు . అంతటి చక్కని కూర్పు శ్రీ రామ అష్టోత్తర శతనామావళి.
భక్తులు అన్ని వేళలా పఠించతగ్గ గొప్ప అష్టోత్రం.
రాముని కృపకొరకే కాక హనుమంతుని, సీతా దేవి యొక్క కృపకొరకు కూడా ఈ అష్టోత్తర పఠనము తప్పనిసరి.
Rama Ashtottara Shatanamavali in Telugu- శ్రీ రామ అష్టోత్తర శతనామావళి- Rama Ashtothram
- ఓం శ్రీ రామాయ నమః
- ఓం రామభద్రాయ నమః
- ఓం రామచంద్రాయ నమః
- ఓం శాశ్వతాయ నమః
- ఓం రాజీవలోచనాయ నమః
- ఓం శ్రీమతే నమః
- ఓం రాజేంద్రాయ నమః
- ఓం రఘుపుంగవాయ నమః
- ఓం జానకీ వల్లభాయ నమః
- ఓం జైత్రాయ నమః
- ఓం జితామిత్రాయ నమః
- ఓం జనార్దనాయ నమః
- ఓం విశ్వామిత్ర ప్రియాయ నమః
- ఓం దాంతాయ నమః
- ఓం శరణత్రాణ తత్పరాయ నమః
- ఓం వాలి ప్రమథనాయ నమః
- ఓం వాగ్మినే నమః
- ఓం సత్యవాచే నమః
- ఓం సత్య విక్రమాయ నమః
- ఓం సత్యవ్రతాయ నమః
- ఓం వ్రతధరాయ నమః
- ఓం సదా హనుమదాశ్రితాయ నమః
- ఓం కౌసలేయాయ నమః
- ఓం ఖరధ్వంసినే నమః
- ఓం విరాధవధ పండితాయ నమః
- ఓం విభీషణ పరిత్రాత్రే నమః
- ఓం హరకోదండ ఖండనాయ నమః
- ఓం సప్తతాళ ప్రభేత్త్రే నమః
- ఓం దశగ్రీవ శిరోహరాయ నమః
- ఓం జామదగ్న్య మహాదర్పదలనాయ నమః
- ఓం తాటకాంతకాయ నమః
- ఓం వేదాంతసారాయ నమః
- ఓం వేదాత్మనే నమః
- ఓం భవరోగస్యభేషజాయ నమః
- ఓం దూషణత్రిశిరోహంత్రే నమః
- ఓం త్రిమూర్తయే నమః
- ఓం త్రిగుణాత్మకాయ నమః
- ఓం త్రివిక్రమాయ నమః
- ఓం త్రిలోకాత్మనే నమః
- ఓం పుణ్యచారిత్ర కీర్తనాయ నమః
- ఓం త్రిలోక రక్షకాయ నమః
- ఓం ధన్వినే నమః
- ఓం దండకారణ్య కర్తనాయ నమః
- ఓం అహల్యాశాప శమనాయ నమః
- ఓం పితృభక్తాయ నమః
- ఓం వరప్రదాయ నమః
- ఓం జితేంద్రియాయ నమః
- ఓం జితక్రోధాయ నమః
- ఓం జితామిత్రాయ నమః
- ఓం జగద్గురవే నమః
- ఓం ఋక్షవానర సంఘాతినే నమః
- ఓం చిత్రకూట సమాశ్రయాయ నమః
- ఓం జయంతత్రాణ వరదాయ నమః
- ఓం సుమిత్రాపుత్ర సేవితాయ నమః
- ఓం సర్వదేవాధిదేవాయ నమః
- ఓం మృతవానర జీవనాయ నమః
- ఓం మాయామారీచ హంత్రే నమః
- ఓం మహాదేవాయ నమః
- ఓం మహాభుజాయ నమః
- ఓం సర్వదేవస్తుతాయ నమః
- ఓం సౌమ్యాయ నమః
- ఓం బ్రహ్మణ్యాయ నమః
- ఓం మునిసంస్తుతాయ నమః
- ఓం మహాయోగినే నమః
- ఓం మహోదారాయ నమః
- ఓం సుగ్రీవేప్సిత రాజ్యదాయ నమః
- ఓం సర్వపుణ్యాధికఫలాయ నమః
- ఓం స్మృతసర్వాఘనాశనాయ నమః
- ఓం ఆదిపురుషాయ నమః
- ఓం పరమపురుషాయ నమః
- ఓం మహాపురుషాయ నమః
- ఓం పుణ్యోదయాయ నమః
- ఓం దయాసారాయ నమః
- ఓం పురాణ పురుషోత్తమాయ నమః
- ఓం స్మితవక్త్రాయ నమః
- ఓం మితభాషిణే నమః
- ఓం పూర్వభాషిణే నమః
- ఓం రాఘవాయ నమః
- ఓం అనంతగుణ గంభీరాయ నమః
- ఓం ధీరోదాత్త గుణోత్తమాయ నమః
- ఓం మాయామానుష చారిత్రాయ నమః
- ఓం మహాదేవాది పూజితాయ నమః
- ఓం సేతుకృతే నమః
- ఓం జితవారాశయే నమః
- ఓం సర్వతీర్థమయాయ నమః
- ఓం హరయే నమః
- ఓం శ్యామాంగాయ నమః
- ఓం సుందరాయ నమః
- ఓం శూరాయ నమః
- ఓం పీతవాససే నమః
- ఓం ధనుర్ధరాయ నమః
- ఓం సర్వయజ్ఞాధిపాయ నమః
- ఓం యజ్వినే నమః
- ఓం జరామరణ వర్జితాయ నమః
- ఓం విభీషణ ప్రతిష్ఠాత్రే నమః
- ఓం సర్వావ గుణవర్జితాయ నమః
- ఓం పరమాత్మనే నమః
- ఓం పరస్మై బ్రహ్మణే నమః
- ఓం సచ్చిదానంద విగ్రహాయ నమః
- ఓం పరస్మై జ్యోతిషే నమః
- ఓం పరస్మై ధామ్నే నమః
- ఓం పరాకాశాయ నమః
- ఓం పరాత్పరాయ నమః
- ఓం పరేశాయ నమః
- ఓం పారగాయ నమః
- ఓం పారాయ నమః
- ఓం సర్వదేవాత్మకాయ నమః
- ఓం పరస్మై నమః
ఇతి శ్రీ రామ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
Leave a Comment