Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Sai Baba Ashtottara Shatanamavali in Telugu (Ashtothram)- సాయి బాబా అష్టోత్రం అష్టోత్తర శతనామావళి

భక్తుల పాలిట పెన్నిధిగా పేరుపొందిన సాయినాథుని ప్రార్ధించుటలో సాయి బాబా అష్టోత్తర శతనామావళికి ఒక ప్రేత్యేకమైన స్థానం ఉంది. నిత్య పూజలకు సాయి బాబా అష్టోత్రం, సాయి సత్చరిత్ర పారాయణం ఎంతో శ్రేయోభిదాయకం.

ఈ సాయి బాబా అష్టోత్రం లోని 108 నామాలు సాయినాధుని కరుణా కటాక్షాలని, దయా గుణాన్ని, అనేక జీవితాంశాలను కలుపుతూ వాటిని వివరిస్తూ సాగుతుంటాయి.

గురువారం నాడు, పర్వదినాలలో ఈ సాయి అష్టోత్రం పఠించటం వలన శారీరక, మానసిక భాధలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం .

Sai Baba Ashtothram in Telugu Sai baba Ashtottara Shatanamavali.jpg

Sai Baba Ashtothram in Telugu – Ashtottara Shatanamavali సాయి బాబా అష్టోత్రం- అష్టోత్తర శతనామావళి

  1. ఓం శ్రీ  సాయినాధాయ నమః
  2. ఓం లక్ష్మీ నారాయణాయ నమః
  3. ఓం కృష్ణ రామ శివ మారుత్యాది రూపాయ నమః
  4. ఓం శేషసాయినే నమః
  5. ఓం గోదావరీతట షిర్డివాసినే నమః
  6. ఓం భక్త హృదయాయ నమః
  7. ఓం సర్వహృద్వాసినే నమః
  8. ఓం భూత వాసాయ నమః
  9. ఓం భూత భవిష్యద్బావ వర్జితాయ నమః
  10. ఓం కాలతీతాయ నమః
  11. ఓం కాలాయ నమః
  12. ఓం కాలకాలాయ నమః
  13. ఓం కాలదర్ప దమనాయ నమః
  14. ఓం మృత్యుంజయాయ నమః
  15. ఓం అమర్త్యాయ నమః
  16. ఓం ముర్త్యాభయ ప్రదాయ నమః
  17. ఓం జీవధారాయ నమః
  18. ఓం సర్వాధారాయ నమః
  19. ఓం భక్తవన సమర్ధాయ నమః
  20. ఓం భక్తావన ప్రతిజ్ఞాన సమార్థాయ నమః
  21. ఓం అన్న-వస్త్రదాయ నమః
  22. ఓం ఆరోగ్య క్షేమదాయ నమః
  23. ఓం ధన మాంగల్య ప్రదాయ నమః
  24. ఓం బుద్ధిసిద్ధి ప్రదాయ నమః
  25. ఓం పుత్ర మిత్ర కళత్ర బంధుదాయ నమః
  26. ఓం యోగక్షేమవహాయ నమః
  27. ఓం ఆపద్బాంధవాయ నమః
  28. ఓం మార్గబంధవే నమః
  29. ఓం భక్తిముక్తి స్వర్గాపదాయ నమః
  30. ఓం ప్రియాయ నమః
  31. ఓం ప్రీతి వర్ధనాయ నమః
  32. ఓం అంతర్యామినే నమః
  33. ఓం సచ్చిదాత్మనే నమః
  34. ఓం నిత్యానందాయ నమః
  35. ఓం పరమ సుఖదాయ నమః
  36. ఓం పరమేశ్వరాయ నమః
  37. ఓం పరబ్రహ్మణే నమః
  38. ఓం పరమాత్మనే నమః
  39. ఓం జ్ఞాన స్వరూపిణ్యై నమః
  40. ఓం జగత్పిత్రే నమః
  41. ఓం భక్తానాం మాతృ పితృ పితామహాయ నమః
  42. ఓం భక్తాభయ ప్రదాయ నమః
  43. ఓం భక్త వత్సలాయ నమః
  44. ఓం భక్తానుగ్రహ కాంతకాయ నమః
  45. ఓం శరణాగత వత్సలాయ నమః
  46. ఓం భక్తిశక్తి ప్రదాయ నమః
  47. ఓం జ్ఞానవైరాగ్యదాయ నమః
  48. ఓం ప్రేమప్రదాయ నమః
  49. ఓం సంసార ధౌర్భల్య పావకర్మ క్షమకారకాయ నమః
  50. ఓం హృదయగ్రంధి భేదకాయ నమః
  51. ఓం కర్మ ధ్వంసినే నమః
  52. ఓం శుద్ధసత్య స్థితాయ నమః
  53. ఓం గుణాతీత గుణాత్మనే నమః
  54. ఓం అనంత కళ్యాణ గుణాయ నమః
  55. ఓం అమిత పరాక్రమాయ నమః
  56. ఓం జయనే నమః
  57. ఓం దుర్ధర్షాక్షోభ్యాయ నమః
  58. ఓం అపరాజితాయ నమః
  59. ఓం త్రిలోకేషాదిపతయే నమః
  60. ఓం అశక్య రహితాయ నమః
  61. ఓం సర్వశక్తి మూర్తయే నమః
  62. ఓం స్వరూప సుందరాయ నమః
  63. ఓం సులోచనాయ నమః
  64. ఓం బహురూప విశ్వమూర్తయే నమః
  65. ఓం అరూపవ్యక్తాయ నమః
  66. ఓం అచింత్యాయ నమః
  67. ఓం సూక్ష్మాయ నమః
  68. ఓం సర్వాంతర్యామినే నమః
  69. ఓం మనోవాగ తీతాయ నమః
  70. ఓం ప్రేమ మూర్తయే నమః
  71. ఓం సులభ దుర్లభాయ నమః
  72. ఓం అనహాయ సహాయాయ నమః
  73. ఓం అనాధనాధ దీనబాంధవే నమః
  74. ఓం సర్వభారబృతే నమః
  75. ఓం అకర్మానేకర్మ సుకర్మిణే నమః
  76. ఓం పుణ్య శ్రవణ కీర్తనాయ నమః
  77. ఓం తీర్థాయ నమః
  78. ఓం వాసుదేవాయ నమః
  79. ఓం సతాంగతయే నమః
  80. ఓం సత్సరాయణాయ నమః
  81. ఓం లోకనాథాయ నమః
  82. ఓం పావనానఘాయ నమః
  83. ఓం అమృతాంశవే నమః
  84. ఓం భాస్కర ప్రభాయ నమః
  85. ఓం బ్రహ్మచర్య తపశ్చర్యాది సువ్రతాయ నమః
  86. ఓం సత్యధర్మ పరాయణాయ నమః
  87. ఓం సిద్దేశ్వరాయ నమః
  88. ఓం సిద్ద సంకల్పాయ నమః
  89. ఓం యోగీశ్వరాయ నమః
  90. ఓం భగవతే నమః
  91. ఓం భక్త వశ్యాయ నమః
  92. ఓం సత్పురుషాయ నమః
  93. ఓం పురుషోత్తమాయ నమః
  94. ఓం సత్యతత్వ బోధకాయ నమః
  95. ఓం కామాది సర్వాఙ్ఙాన ధ్వంసినే నమః
  96. ఓం అభేదానంద శుభప్రదాయ నమః
  97. ఓం సమసర్వమత సమ్మతాయ నమః
  98. ఓం దక్షిణామూర్తయే నమః
  99. ఓం శ్రీ వేంకటేశరమణాయ నమః
  100. ఓం అద్భుతానంత చర్యాయ నమః
  101. ఓం ప్రసన్నార్తి హారాయ నమః
  102. ఓం సంసార సర్వదుఃఖ క్షమాయ నమః
  103. ఓం సర్వవిత్సర్వ తోముఖాయ నమః
  104. ఓం సర్వాంతర్భస్థితాయ నమః
  105. ఓం సర్వ మంగళ కరాయ నమః
  106. ఓం సర్వాభీష్ట ప్రదాయ నమః
  107. ఓం సమరస సన్మార్గ స్థాపనాయ నమః
  108. ఓం సమర్దసద్గురు శ్రీసాయినాథాయ నమః

ఇతి శ్రీ షిరిడీసాయి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

About the author

Stotra Manjari Team

Leave a Comment