విద్య ప్రదాయినిగా, జ్ఞాన స్వరూపిణిగా ఉన్న సరస్వతీ దేవి ప్రార్ధనలో సరస్వతీ అష్టోత్రం నకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
మంత్రం, స్తోత్రం, కవచంతో పాటు ఆ తల్లికి అష్టోత్తర శతనామావళి పారాయణ కూడా ఎంతో ప్రీతీ అని పెద్దల మాట. అందుకే సరస్వతీ పూజ విధానంలో స్తోత్రకవచాలతోపాటుగా సరస్వతీ అష్టోత్తర శతనామావళి పూజను కూడా కలుపుతుంటారు.
అంతటి విశిష్టమైన సరస్వతీ అష్టోత్రంలోని నామములు దేవీ వైభవాన్ని, గుణగణాలనూ, రూపమునూ గొప్పగా వివరిస్తుంటాయి.
విద్యారంభ సమయములో, పూజా సమయములో, ప్రత్యేక దినముల యందు ఈ 108 నామాల స్మరణం తప్పనిసరి. విద్యారంభం, తమ పిల్లల కోసం చదివేవారు సరస్వతి అష్టోత్రంతోపాటు శివ అష్టోత్రం, గణేశ అష్టోత్తర శతనామావళి చదవటం ఉత్తమం.
Sri Saraswathi Ashtottara Shatanamavali in Telugu – Saraswathi Ashtothram in Telugu శ్రీ సరస్వతీ అష్టోత్రం
- ఓం సరస్వత్యై నమః
- ఓం మహాభద్రాయై నమః
- ఓం మహామాయాయై నమః
- ఓం వరప్రదాయై నమః
- ఓం శ్రీప్రదాయై నమః
- ఓం పద్మ నిలయాయై నమః
- ఓం పద్మాక్ష్యై నమః
- ఓం పద్మ వక్త్రాయై నమః
- ఓం శివానుజాయై నమః
- ఓం పుస్తకభృతే నమః
- ఓం జ్ఞాన ముద్రాయై నమః
- ఓం రమాయై నమః
- ఓం పరాయై నమః
- ఓం కామరూపాయై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం మహాపాతక నాశిన్యై నమః
- ఓం మహాశ్రయాయై నమః
- ఓం మాలిన్యై నమః
- ఓం మహాభోగాయై నమః
- ఓం మహాభుజాయై నమః
- ఓం మహాభాగాయై నమః
- ఓం మహోత్సాహాయై నమః
- ఓం దివ్యాంగాయై నమః
- ఓం సురవందితాయై నమః
- ఓం మహాకాళ్యై నమః
- ఓం మహాపాశాయై నమః
- ఓం మహాకారాయై నమః
- ఓం మహాంకుశాయై నమః
- ఓం సీతాయై నమః
- ఓం విమలాయై నమః
- ఓం విశ్వాయై నమః
- ఓం విద్యున్మాలాయై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం చంద్రికాయై నమః
- ఓం చంద్రవదనాయై నమః
- ఓం చంద్రలేఖ విభూషితాయై నమః
- ఓం సావిత్ర్యై నమః
- ఓం సురసాయై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం దివ్యాలంకార భూషితాయై నమః
- ఓం వాగ్దేవ్యై నమః
- ఓం వసుధాయై నమః
- ఓం తీవ్రాయై నమః
- ఓం మహాభద్రాయై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం భోగదాయై నమః
- ఓం భారత్యై నమః
- ఓం భామాయై నమః
- ఓం గోవిందాయై నమః
- ఓం గోమత్యై నమః
- ఓం శివాయై నమః
- ఓం జటిలాయై నమః
- ఓం వింధ్య వాసాయై నమః
- ఓం వింధ్యాచల విరాజితాయై నమః
- ఓం చండికాయై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం బ్రాహ్మ్యై నమః
- ఓం బ్రహ్మజ్ఞానైక సాధనాయై నమః
- ఓం సౌదామిన్యై నమః
- ఓం సుధామూర్త్యై నమః
- ఓం సుభద్రాయై నమః
- ఓం సుర పూజితాయై నమః
- ఓం సువాసిన్యై నమః
- ఓం సునాసాయై నమః
- ఓం వినిద్రాయై నమః
- ఓం పద్మలోచనాయై నమః
- ఓం విద్యారూపాయై నమః
- ఓం విశాలాక్ష్యై నమః
- ఓం బ్రహ్మజాయాయై నమః
- ఓం మహాఫలాయై నమః
- ఓం త్రయీమూర్త్యై నమః
- ఓం త్రికాలజ్ఞాయై నమః
- ఓం త్రిగుణాయై నమః
- ఓం శాస్త్రరూపిణ్యై నమః
- ఓం శుంభాసుర ప్రమథిన్యై నమః
- ఓం శుభదాయై నమః
- ఓం స్వరాత్మికాయై నమః
- ఓం రక్తబీజనిహంత్ర్యై నమః
- ఓం చాముండాయై నమః
- ఓం అంబికాయై నమః
- ఓం ముండకాయ ప్రహరణాయై నమః
- ఓం ధూమ్రలోచన మర్ధిన్యై నమః
- ఓం సర్వదేవ స్తుతాయై నమః
- ఓం సౌమ్యాయై నమః
- ఓం సురాసుర నమస్కృతాయై నమః
- ఓం కాళరాత్ర్యై నమః
- ఓం కళాధారాయై నమః
- ఓం రూప సౌభాగ్య దాయిన్యై నమః
- ఓం వాగ్దేవ్యై నమః
- ఓం వరారోహాయై నమః
- ఓం వారాహ్యై నమః
- ఓం వారిజాసనాయై నమః
- ఓం చిత్రాంబరాయై నమః
- ఓం చిత్రగంధాయై నమః
- ఓం చిత్రమాల్య విభూషితాయై నమః
- ఓం కాంతాయై నమః
- ఓం కామప్రదాయై నమః
- ఓం వంద్యాయై నమః
- ఓం విద్యాధర సుపూజితాయై నమః
- ఓం శ్వేతాననాయై నమః
- ఓం నీలభుజాయై నమః
- ఓం చతుర్వర్గ ఫలప్రదాయై నమః
- ఓం చతురానన సామ్రాజ్యాయై నమః
- ఓం రక్తమధ్యాయై నమః
- ఓం నిరంజనాయై నమః
- ఓం హంసాసనాయై నమః
- ఓం నీల-జంఘాయై నమః
- ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
ఇతి శ్రీ సరస్వతీ అష్టోత్తర శతనామావళి సమాప్తా.
Leave a Comment