Ashtothram అష్టోత్తరం-అష్టోత్రం

Varahi Ashtothram in Telugu- శ్రీ వారాహి అష్టోత్రం (తెలుగు)

సప్తమాత్రికలలో ఒకరిగా, లలితా దేవికి దండనాయికగా పూజలందుకొంటున్న దేవి వారాహి. ఆ దేవి యొక్క 108 దివ్య నామములే ఈ వారాహి అష్టోత్రం.

భక్త సులభురాలగు వారాహిని ప్రార్ధించుటలో వారాహి అష్టోత్తర శతనామావళి ఎంతో ముఖ్యమైనది. దేవీనామాలను స్మరిస్తూ వారాహి వైభవాన్ని తెలుసుకుంటూ సాగుతుంటుంది ఈ అష్టోత్రం.

శాక్త, శైవ, వైష్ణవ సంప్రదాయాలు అన్నింటిలోనూ వారాహి దేవికి ప్రత్యేకమైన స్థానం ఉంది. వారాహి ప్రార్ధన, పూజలు ఎంతో శక్తివంతమైనవి, శతృ సంహారంకోసం, ధనప్రాప్తి కోసం, వివాదాల పరిష్కారం కోసం తప్పక పఠించ తగ్గవి వారాహి అష్టోత్రం, వారాహి ద్వాదశనామ స్తోత్రం, వారాహి మంత్రం.

Varahi Ashtothram in Telugu, Varahi Ashtottara Shatanamavali

Sri Varahi Ashtothram in Telugu- వారాహి అష్టోత్రం, అష్టోత్తర శతనామావళి

  1. ఓం వరాహవదనాయై నమః
  2. ఓం వారాహ్యై నమః
  3. ఓం వరరూపిణ్యై నమః
  4. ఓం క్రోడాననాయై నమః
  5. ఓం కోలముఖ్యై నమః
  6. ఓం జగదంబాయై నమః
  7. ఓం తారుణ్యై నమః
  8. ఓం విశ్వేశ్వర్యై నమః
  9. ఓం శంఖిన్యై నమః
  10. ఓం చక్రిణ్యై నమః
  11. ఓం ఖడ్గ శూల గదాహస్తాయై నమః
  12. ఓం ముసల ధారిణ్యై నమః
  13. ఓం హలసకాది సమాయుక్తాయై నమః
  14. ఓం భక్తానాం అభయప్రదాయై నమః
  15. ఓం ఇష్టార్థదాయిన్యై నమః
  16. ఓం ఘోరాయై నమః
  17. ఓం మహాఘోరాయై నమః
  18. ఓం మహామాయాయై నమః
  19. ఓం వార్తాళ్యై నమః
  20. ఓం జగదీశ్వర్యై నమః
  21. ఓం అంధే అంధిన్యై నమః
  22. ఓం రుంధే రుంధిన్యై నమః
  23. ఓం జంభే జంభిన్యై నమః
  24. ఓం మోహే మోహిన్యై నమః
  25. ఓం స్తంభే స్తంభిన్యై నమః
  26. ఓం దేవేశ్యై నమః
  27. ఓం శత్రునాశిన్యై నమః
  28. ఓం అష్టభుజాయై నమః
  29. ఓం చతుర్హస్తాయై నమః
  30. ఓం ఉన్మత్తభై రవాంకస్థాయై నమః
  31. ఓం కపిల లోచనాయై నమః
  32. ఓం పంచమ్యై నమః
  33. ఓం లోకేశ్యై నమః
  34. ఓం నీలమణి ప్రభాయై నమః
  35. ఓం అంజనాద్రి ప్రతీకాశాయై నమః
  36. ఓం సింహారూఢాయై నమః
  37. ఓం త్రిలోచనాయై నమః
  38. ఓం శ్యామలాయై నమః
  39. ఓం పరమాయై నమః
  40. ఓం ఈశాన్యై నమః
  41. ఓం నీలాయై నమః
  42. ఓం ఇందీవర సన్నిభాయై నమః
  43. ఓం ఘనస్తన సమోపేతాయై నమః
  44. ఓం కపిలాయై నమః
  45. ఓం కళాత్మికాయై నమః
  46. ఓం అంబికాయై నమః
  47. ఓం జగద్ధారిణ్యై నమః
  48. ఓం భక్తోపద్రవ నాశిన్యై నమః
  49. ఓం సగుణాయై నమః
  50. ఓం నిష్కళాయై నమః
  51. ఓం విద్యాయై నమః
  52. ఓం నిత్యాయై నమః
  53. ఓం విశ్వ-వశంకర్యై నమః
  54. ఓం మహారూపాయై నమః
  55. ఓం మహేశ్వర్యై నమః
  56. ఓం మహేంద్రితాయై నమః
  57. ఓం విశ్వవ్యాపిన్యై నమః
  58. ఓం దేవ్యై నమః
  59. ఓం పశూనాం అభయంకర్యై నమః
  60. ఓం కాళికాయై నమః
  61. ఓం భయదాయై నమః
  62. ఓం బలిమాంస మహాప్రియాయై నమః
  63. ఓం జయభైరవ్యై నమః
  64. ఓం కృష్ణాంగాయై నమః
  65. ఓం పరమేశ్వర వల్లభాయై నమః
  66. ఓం సుధాయై నమః
  67. ఓం స్తుత్యై నమః
  68. ఓం సురేశాన్యై నమః
  69. ఓం బ్రహ్మాది వరదాయిన్యై నమః
  70. ఓం స్వరూపిణ్యై నమః
  71. ఓం సురానాం అభయప్రదాయై నమః
  72. ఓం వరాహదేహ సంభూతాయై నమః
  73. ఓం శ్రోణీ వారాలసే నమః
  74. ఓం క్రోధిన్యై నమః
  75. ఓం నీలాస్యాయై నమః
  76. ఓం శుభదాయై నమః
  77. ఓం అశుభవారిణ్యై నమః
  78. ఓం శత్రూణాం వాక్‍స్తంభనకారిణ్యై నమః
  79. ఓం శత్రూణాం గతిస్తంభనకారిణ్యై నమః
  80. ఓం శత్రూణాం మతిస్తంభనకారిణ్యై నమః
  81. ఓం శత్రూణాం అక్షిస్తంభనకారిణ్యై నమః
  82. ఓం శత్రూణాం ముఖస్తంభిన్యై నమః
  83. ఓం శత్రూణాం జిహ్వాస్తంభిన్యై నమః
  84. ఓం శత్రూణాం నిగ్రహకారిణ్యై నమః
  85. ఓం శిష్టానుగ్రహకారిణ్యై నమః
  86. ఓం సర్వశత్రు క్షయంకర్యై నమః
  87. ఓం సర్వశత్రు సాదనకారిణ్యై నమః
  88. ఓం సర్వశత్రు విద్వేషణకారిణ్యై నమః
  89. ఓం భైరవీ ప్రియాయై నమః
  90. ఓం మంత్రాత్మికాయై నమః
  91. ఓం యంత్రరూపాయై నమః
  92. ఓం తంత్రరూపిణ్యై నమః
  93. ఓం పీఠాత్మికాయై నమః
  94. ఓం దేవదేవ్యై నమః
  95. ఓం శ్రేయస్కర్యై నమః
  96. ఓం చింతితార్థ ప్రదాయిన్యై నమః
  97. ఓం భక్తాఅలక్ష్మీవినాశిన్యై నమః
  98. ఓం సంపత్ప్రదాయై నమః
  99. ఓం సౌఖ్యకారిణ్యై నమః
  100. ఓం బాహువారాహ్యై నమః
  101. ఓం స్వప్నవారాహ్యై నమః
  102. ఓం భగవత్యై నమః
  103. ఓం ఈశ్వర్యై నమః
  104. ఓం సర్వారాధ్యాయై నమః
  105. ఓం సర్వమయాయై నమః
  106. ఓం సర్వలోకాత్మికాయై నమః
  107. ఓం మహిష నాసినాయై నమః
  108. ఓం బృహద్ వారాహ్యై నమః

ఇతి శ్రీ మహా వారాహి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

About the author

Stotra Manjari Team

Leave a Comment