సుప్రసిద్ధమైన కనకధారా స్తోత్రం లక్ష్మీదేవి యొక్క కృప కొరకు జగద్గురు ఆదిశంకరాచార్యులచే కృతించబడినది.
భిక్షకు వెళ్లిన సమయములో ఒక పేద ముదుసలిరాలి స్థితిని చూచి చలించిన మన్నస్సుతో లక్ష్మీదేవిని ఈ కనకధారా స్తోత్రముతో స్తుతించారు జగద్గురువులు.
ఆదిశంకరుని కీర్తనకు మెచ్చిన మహాలక్ష్మీ దేవి ఆ దీనురాలి ఇంటివద్ద కనక వర్షం ధారలుగా కురిపించింది. అప్పటినుంచి ఈ స్తోత్రానికి సువర్ణధార లేదా కనకధారా స్తోత్రం అని పేరువచ్చింది.
లక్ష్మీదేవినే మెప్పించగలిగిన ఈ స్తోత్రం ఎంతో విశేషమైనది, ఆరాధనకు శ్రేష్టమైనది. విష్ణు పత్ని అగు లక్ష్మీ మాత సంబందించిన అనేక గుణగణాలను, రూపమును, గొప్పదనాన్ని, శక్తిని వివరిస్తుంది ఈ స్తోత్రం.
పర్వదినాలలో, పూజ సమయములలో, సిరిసంపదలు కావాలనుకునేవారు తప్పక చదవలసిన లక్ష్మీ స్తోత్రం ఈ కనకధారా స్తోత్రం. ఏ రోజైన ఏ సమయములోనైనా చదవవచ్చు.
Sri Kanakadhara Stotram in Telugu for Goddess Lakshmi – కనకధారా స్తోత్రం తెలుగులో
అంగం హరేః పులకభూషణమాశ్రయంతీ
భృంగాంగనేవ ముకుళాభరణం తమాలమ్
అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా
మాంగళ్యదాస్తు మమ మంగళ దేవతాయాః (1)
ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః
ప్రేమత్రపాప్రణిహితాని గతాగతాని
మాలాదృశోర్మధుకరీవ మహోత్పలే యా
సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః (2)
ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందమ్
ఆనందకంద మనిమేషమనంగ తంత్రమ్
ఆకేకరస్థితకనీనిక పక్ష్మనేత్రం
భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః (3)
బాహ్వంతరే మధుజితః శ్రితకౌస్తుభే యా
హారావళీవ హరినీలమయీ విభాతి
కామప్రదా భగవతోఽపి కటాక్షమాలా
కళ్యాణమావహతు మే కమలాలయాయాః (4)
కాలాంబుదాళి లలితోరసి కైటభారే
ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ
మాతుస్సమస్తజగతాం మహనీయమూర్తిః
భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః (5)
ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్
మాంగళ్యభాజి మధుమాథిని మన్మథేన
మయ్యాపతేత్తదిహ మంథరమీక్షణార్ధం
మందాలసం చ మకరాలయ కన్యకాయాః (6)
విశ్వామరేంద్ర పదవి భ్రమ దానదక్షమ్
ఆనందహేతురధికం మురవిద్విషోఽపి
ఈషన్నిషీదతు మయి క్షణమీక్షణార్ధం
ఇందీవరోదర సహోదరమిందిరాయాః (7)
ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ద్ర
దృష్ట్యా త్రివిష్టపపదం సులభం లభంతే
దృష్టిః ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం
పుష్టిం కృషీష్ట మమ పుష్కరవిష్టరాయాః (8)
దద్యాద్దయాను పవనో ద్రవిణాంబుధారాం
అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే
దుష్కర్మఘర్మమపనీయ చిరాయ దూరం
నారాయణ ప్రణయినీ నయనాంబువాహః (9)
గీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి
శాకంభరీతి శశిశేఖర వల్లభేతి
సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై
తస్యై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై (10)
శ్రుత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై
శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై
పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై (11)
నమోస్తు నాళీక నిభాననాయై
నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
నమోస్తు సోమామృత సోదరాయై
నమోస్తు నారాయణ వల్లభాయై (12)
నమోస్తు హేమాంబుజ పీఠికాయై
నమోస్తు భూమండల నాయికాయై
నమోస్తు దేవాది దయాపరాయై
నమోస్తు శార్ఙ్గాయుధ వల్లభాయై (13)
నమోస్తు దేవ్యై భృగునందనాయై
నమోస్తు విష్ణోరురసి స్థితాయై
నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
నమోస్తు దామోదర వల్లభాయై (14)
నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
నమోస్తు భూత్యై భువనప్రసూత్యై
నమోస్తు దేవాదిభిరర్చితాయై
నమోస్తు నందాత్మజ వల్లభాయై (15)
సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
సామ్రాజ్య దానవిభవాని సరోరుహాక్షి
త్వద్వందనాని దురితాహరణోద్యతాని
మామేవ మాతరనిశం కలయంతు మాన్యే (16)
యత్కటాక్షసముపాసనా విధిః
సేవకస్య సకలార్థ సంపదః
సంతనోతి వచనాంగ మానసై
త్వాం మురారి హృదయేశ్వరీం భజే (17)
సరసిజనిలయే సరోజహస్తే
ధవళతమాంశుక గంధమాల్యశోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే
త్రిభువనభూతికరి ప్రసీద మహ్యమ్ (18)
దిగ్ఘస్తిభిః కనకకుంభ ముఖావసృష్ట
స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీమ్
ప్రాతర్నమామి జగతాం జననీమశేష
లోకాధినాథ గృహిణీమమృతాబ్ధిపుత్రీమ్ (19)
కమలే కమలాక్ష వల్లభే త్వం
కరుణాపూర తరంగితైరపాంగైః
అవలోకయ మామకించనానాం
ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః (20)
స్తువంతి యే స్తుతిభిరమూభిరన్వహం
త్రయీమయీం త్రిభువనమాతరం రమామ్
గుణాధికా గురుతరభాగ్య భాజినో
భవంతి తే భువి బుధభావితాశయాః (21)
సువర్ణధారా స్తోత్రం యచ్ఛంకరాచార్య నిర్మితమ్
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేర సమో భవేత్
Leave a Comment