కృష్ణ భగవానుణ్ణి కీర్తించే అష్టకాలలో ఎంతో సుప్రసిద్ధమైనది ఈ మధురాష్టకం. శ్రీ కృష్ణుని రూపు రేఖలు, లీలావినోదాలను, ఆటపాటలను, ఇలా కృష్ణునికి సంభందించిన ఎన్నో విషయాలను మధురంగా వివరిస్తుంది మధురాష్టకం.
శ్రీ కృష్ణుని గుణగణాలతో పాటుగా రూపమునూ ఆణువణువూ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తుంది మధురాష్టకం. కృష్ణ భక్తులు ఇష్టంగా పాడుకునే స్తోత్రాలలో ఈ అష్టకం కూడా ఒకటి.
సులభమైన పదములతో చేసిన చక్కని కూర్పు ఈ మధురాష్టకం. చదివిన ప్రతీ భక్తుని మనస్సుని కృష్ణ భగవానుని వైపు పయనింపచేస్తుంది.అన్ని వేళల పఠించతగ్గ గొప్ప అష్టకం ఇది.
భక్తుల కష్టాలను తొలగించి మనస్సుకి ప్రశాంతతను చేకూరుస్తుంది ఈ దివ్య కీర్తన.
Madhurashtakam in Telugu to Worship Lord Krishna – మధురాష్టకం
అధరం మధురం వదనం మధురం
నయనం మధురం హసితం మధురం
హృదయం మధురం గమనం మధురం
మధురాధిపతేరఖిలం మధురం (1)
వచనం మధురం చరితం మధురం
వసనం మధురం వలితం మధురం
చలితం మధురం భ్రమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం (2)
వేణుర్మధురో రేణుర్మధురః
పాణిర్మధురః పాదౌ మధురౌ
నృత్యం మధురం సఖ్యం మధురం
మధురాధిపతేరఖిలం మధురం (3)
గీతం మధురం పీతం మధురం
భుక్తం మధురం సుప్తం మధురం
రూపం మధురం తిలకం మధురం
మధురాధిపతేరఖిలం మధురం (4)
కరణం మధురం తరణం మధురం
హరణం మధురం రమనం మధురం
వమితం మధురం శమితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం (5)
గుంజా మధురా మాలా మధురా
యమునా మధురా వీచీ మధురా
సలిలం మధురం కమలం మధురం
మధురాధిపతేరఖిలం మధురం (6)
గోపీ మధురా లీలా మధురా
యుక్తం మధురం ముక్తం మధురం
దృష్టం మధురం శిష్టం మధురం
మధురాధిపతేరఖిలం మధురం (7)
గోపా మధురా గావో మధురా
యష్టిర్మధురా సృష్టిర్మధురా
దలితం మధురం ఫలితం మధురం
మధురాధిపతేరఖిలం మధురం (8)
ఇతి శ్రీ మధురాష్టకం సంపూర్ణం
Leave a Comment